News
News
X

YS Sharmila on Kavitha: బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాం, తప్పించుకునేందుకే కవిత దొంగదీక్ష: షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila on Kavitha: బతుకమ్మ ముసుగులో ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంకు పాల్పడిందని, ఇప్పడు దాని నుంచి తప్పించుకునేందుకు దొంగ దీక్ష చేస్తోందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. 

FOLLOW US: 
Share:

YS Sharmila on Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బతుకమ్మ ముసుగు వేసుకొని ఢిల్లీ లిక్కర్ స్కాంకు పాల్పడిందని ఆరోపించారు. ఆపై స్కామ్ నుంచి తప్పించుకునేందుకే ఆమె ఢిల్లీలో దీక్ష చేస్తోందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత దీక్ష చేయాలనుకుంటే... ఢిల్లీలో కాకుండా ప్రగతి భవన్ ముందు చేయాలని సూచించారు. కవిత చేసే పనుల వల్ల యావత్ మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కాంతో కవితకు సంబంధం లేకపోతే ఆమెపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే అయితే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు. మీడియా ముందుకు వచ్చి అసలేం జరిగిందో అందరికీ చెప్పాలని సూచించారు. అన్నింటిపై నోరు పారేసుకునే ప్రతిపక్ష నేత, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఈ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 

అలాగే 2014, 18 ఎన్నికల్లో ఎంత మంది మహిళలకు రాజకీయంగా కేసీఆర్ అవకాశం ఇచ్చారో కవిత చెప్పాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో నాలుగు, ఐదు శాతం కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయని మీరు.. ఢిల్లీలో మహిళలకు  శాతం రిజర్వేషన్లు కల్పించాలని దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కవిత రేపో మాపో అరెస్ట్ కాబోతుందని తెలిసే ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, మంత్రి కేటీఆర్ కు మహిళలు అంటే ఏమాత్రం గౌరవం లేదని అన్నారు. పోడు భూముల కోసం కొట్లాడిన మహిళలను, 317 జీవో రద్దు కోసం మహిళా ఉపాధ్యాయులు పిల్లలతో సహా నిరసనకు దిగితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో మహిళ అంటే ఒక్క కేసీఆర్ కూతురే అన్నట్లుగా చూపిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఓడిపోయినా సరే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. 

వారం కిందట ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన షర్మిల

బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన కవిత మహిళలకే తలవంపు తెచ్చారని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఇపుడు ఆ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలంటూ ఆరోపించారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని.. ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ ముందని సూచించారు.  రాష్ట్రంలో రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా మహిళలకు 33 సీట్లు ఎందుకు కేటాయించలేదని కవితను షర్మిల ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో కేసీఆర్ కు అడ్డంకేంటని ప్రశ్నించారు. కేబినెట్ లో పట్టుమని ఇద్దరే మంత్రులు ఉన్నారని..ఇదేనా  మహిళలపై మీకున్న ప్రేమ అని  ఎద్దేవా  చేశారు. అయితే అసలు ఢిల్లీ లిక్కర్ స్కాంకు...  కవిత చేస్తున్న మహిళా రిజర్వేషన్ పోరాటానికి సంబంధం ఏముందని బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో షర్మిలను ప్రశ్నిస్తున్నారు. సాటి మహిళగా ఉండి.. మహిళా రిజర్వేషన్లపై పోరాటానికి మద్దతివ్వకుండా.. పైగా కించ పరిచేలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కేంద్రాన్ని కవిత ప్రశ్నించవద్దా అంటున్నారు.                   

  

Published at : 10 Mar 2023 04:25 PM (IST) Tags: YSRTP President ys sharmila comments Telangana News YS Sharmila on Kavitha MLC Kavitha Protest

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

“ఆరోగ్య మహిళ" స్కీమ్ అంటే ఏంటి? ఏయే టెస్టులు చేస్తారో తెలుసా

“ఆరోగ్య మహిళ

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

కొత్తదనం, పచ్చదనంలో HMDA విప్లవాత్మక అడుగులు - రహదారుల వెంట నందనవనాలు

కొత్తదనం, పచ్చదనంలో HMDA విప్లవాత్మక అడుగులు - రహదారుల వెంట నందనవనాలు

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?