అన్వేషించండి

Most Expensive Dog: హైదరాబాద్ లో 20 కోట్ల కుక్క, ఎందుకంత క్రేజ్? స్పెషాలిటీ ఇదే

Worlds Most Expensive Dog: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జాతికి చెందిన శునకం హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంది.

Most Expensive Dog In Hyderabad: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జాతికి చెందిన శునకం హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంది. కుక్క ఖరీదంటే మహా అయితే ఎంతుంటుంది.? వేలో, లక్షల్లో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు ఖరీదు పలుకుతోంది హైదరాబాద్ లో తళుక్కుమన్న కాస్ట్లీ కుక్క. అంతేకాదండోయ్ బెంగుళూరులో ఎక్కడైనా వైభంగా వేడుకలు జరిగితే అక్కడ ఈ కాస్ట్ లీ కుక్కను ప్రత్యేక అతిథిగా పిలవాల్సిందేనట.

బెంగుళూరుకు చెందిన శతీష్‌ క్యాడబామ్ జంతు ప్రేమికుడు. వివిద జాతులకు చెందిన కుక్కలు పెంచడం శతీష్‌ హాబీ. అప్పుడప్పుడు సినిమాలలో సైతం నటిస్తూ ,వెరైటీ శునకాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇతను ఏడాది క్రితం పదినెలలు వయస్సున్న కొజీషియన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్కను రష్యానుండి కొనుగోలు చేశాడు. అలా ఇంపోర్ట్ చేసుకున్న కుక్కకు హైడర్ అని పేరుపెట్టాడు శతీష్‌. రష్యా నుండి బెంగుళూరుకు కుక్కను తీసుకొచ్చిన సమయంలో భారీగా హైడర్ కు స్వాగతం పలకడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రత్యేక విమానంలో రష్యా నుండి బెంగుళూరుకు హైడర్ ను తీసుకురావడంతోపాటు ఏకంగా నూట యాభై మంది సెలబ్రటీలు, నూట యాభై మంది బైక్ రేసర్లు ఎయిర్ పోర్టు వద్ద హైడర్ ను ఘనంగా ఇండియాకు ఆహ్వనించడంతో హైడర్ కు ఓ రేంజ్ క్రేజ్ వచ్చింది. ప్రపంచంలోనే ఇంతలా బరువువున్న కుక్కలు అత్యంత అరుదుగా ఉంటాయి. అందుకే ఈ కుక్కకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ అని కొందరు చెబుతున్నారు.
 
రోజుకు ఎంత చికెన్ తింటుందంటే..
అలా బెంగుళూరు అడుగుపెట్టిన వెంటనే ఈ కుక్కకు ఇరవై కోట్లు ఆఫర్ వచ్చిందట. మీరు హైడర్ ను మాకు ఇస్తే ఇరవై కోట్లు ఇస్తామంటూ బెంగుళూరుకు చెందిన ఓ బిల్డర్ ఆఫర్ చేశారట. అలా ఆ రోజు నుండి ఇది ఇండియాలో అత్యంత ఖరీదైన ఇరవై కోట్ల కుక్కగా మారిపోయింది. అంతేకాదండోయ్ రోజుకు ఏకంగా మూడు కేజీల రా చికెన్ లాగించేడంతోపాటు ,దీనికి ఒక్కసారి గ్రూమింగ్ చేస్తే అయ్యే ఖర్చు ఏడువేల ఐదువందలు.ఇలా నెల మొత్తం ఈ హైడర్ ఖర్చు ఓ రెంజ్ లో ఉంటుంది. అంతేకాదండోయ్ బెంగుళూరులో ఏ వేడుక జరిగినా హైడర్ ను ముఖ్యఅతిథిగా పిలుస్తారు. ఫంక్షన్ సెక్సెస్ అవ్వాంటే హైడర్ ఉండాల్సిందే. అందుకే ఒక్కో ఫంక్షన్ కు హాజరైయ్యేందుకు ఈ హైడర్ కు సెలబ్రీటీలకన్నా రెట్టింపు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
 
ఎండను తట్టుకోలేదు.. 
వంద కేజీల బరువు, ఒతైన జుట్టు, జుట్టుపై అందమైన లైన్స్ , అచ్చం పులి పంజాను పోలినట్లుగా కాలి ముద్రలు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే హైడర్ ప్రత్యేకతలే వేరండి. ఇంత బరువైన కుక్క కాస్త ఎండ తగిలితే మాత్రం తట్టుకోలేదండి. అందుకే ఎప్పుడూ ఏసీ గదులలో మాత్రమే ఉంటుంది. చల్లని ప్రదేశాలలో మాత్రమే ఉండేందుకు ఇష్టపడుతుంది. బెంగుళూరులో ప్రత్యేకంగా ఓ ఫామ్ హౌస్ లో హైడర్ అలనా పాలన చూసేందుకు ఓ కుటుంబం ఉంటుంది. నిత్యం హైడర్ ను కంటికి రెప్పలా కాపాడుతుంటారు. నగరంలో రోడ్లపై హైడర్ సింహాల నడుస్తుంటే బెంగుళూర్ లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిందేనట. అంతలా క్రేజీ డాక్ కావడంతో హైడర్ ను చూసేందుకు హైదరాబాద్ వాసులు సైతం ఎగబడ్డారు. ఖరీదైన శునకంతో ఫోటోలు దిగుతూ సరదా తీర్చుకున్నారు. సింకింద్రాబాద్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసిన హైడర్ ను చూసి ఫిదాఅయ్యారు జంతుప్రేమికులు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget