Jeevan Reddy: జీవన్ రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ రెండు ముక్కలు కానుందా!, సిఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి
Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు చెబితే మంత్రులు సైతం హడలిపోతున్నారు.మాకొద్దు బాబోయ్ ఆ పంచాయితీ అంటూ డిస్టెన్స్ పాటిస్తున్నారు.

Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు వర్సెస్ జూనియర్లు మధ్య వార్ పార్టీకి కొత్తకాదు. అలకలు , బహిరంగ విమర్శలు, బాహాబాహీ బలప్రదర్శనలు సర్వసాధారణం. ఇన్ని జరిగినా, జరుగుతున్నా.. తెలంగాణలో రేవంత్ సారథ్యంలో అధికారం చేపట్టి అలా ముందుకు సాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్నరాజకీయ రచ్చ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పిగా మారింది. కొందరు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు జీవన్ రెడ్డి నియోజకవర్గం అంటేనే హడలిపోతున్నారు. అక్కడ సొంతపార్టీలొో వర్గపోరులో తామెందుకు ఇరుక్కొవడం అనుకుని జగిత్యాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా మంత్రి పొంగులేటి ముందే జీవన్ రెడ్డి ఆగ్రహం చూసిన కాంగ్రెస్ నేతలకు పార్టీలో ఏం జరుగుతుందో అర్దంకాని అయోమయం నెలకొంది. ఇక మీ రాజ్యం.. మీరే ఏలుకోండి.. అంటూ పొంగులేటి ముఖంమీదే అనేశారు జీవన్ రెడ్డి. రాకరాక కాంగ్రెస్ కు అధికారం చేతికొస్తే ,అదేపార్టీలో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి అలా అనేశారేంటి, ఆయన అంతలా రగిలిపోవడం వెనుక ఏం జరుగుతోంది అనే ఆసక్తి తెలంగాణ రాజకీయాల హీటెక్కిస్తోంది.
జీవన్ రెడ్డి ఆగ్రహానికి కారణాలు ఇవే..
తెంగాణ కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి వీహెచ్ తరువాత అంతటి సీనియర్ నేత, ఆరు సార్లు ఎమ్మెల్యేగా , ఓసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల మద్దతు దండిగా ఉన్నా, హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు జీవన్ రెడ్డికి మంటెక్కిస్తున్నాయి. గత ఎన్నికల్లో తనకు ప్రత్యర్దిగా పోటీ చేసి గెలిచిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బిాఆర్‌ఎస్ వీడి హైదరాాబాద్‌లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు. ఆ రోజు మొదలు జీవన్ రెడ్డికి కంటిమీద కునుకులేదంటే అతిశయోక్తికాదు. నా ప్రత్యర్దినే , నా అనుమతి లేకుండా కాంగ్రెస్‌లోకి ఎలా చేర్చుకుంటారు. పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన తనను కాదని, సంజయ్‌ను అందలం ఎక్కిస్తారా అంటూ జీవన్ రెడ్డి రగిలిపోతున్నారు. అనేక సందర్భాల్లో తన అసంతృప్తిని బహిరంగంగానే బయటపెట్టారు. రేవంత్ నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో సీనియర్లను పట్టించుకోవడంలేదంటూ రగిలిపోతున్నారు. ఇలా జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఆ సెగలు జగిత్యాలను రాజకీయలను మాత్రమేకాదు, ఏకంగా తెలంగాణ అంతటా వ్యాపిస్తున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి సైతం జోక్యం చేసుకోవడానికి సాహసం చేయలేనంతలా వివాదం ముదిరిపోయింది.
జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్లు..
జీవన్ రెడ్డి ఆవేదన రెవంత్ రెడ్డి కోటరీకి పట్టడంలేదని విమర్శలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో రేవంత్ తీరుపై అసంతృప్తిగా ఉన్న కొందరు మంత్రులు, సీనియర్లు జీవన్ రెడ్డికి మద్దతుగా ఏకమవుతున్నారట. ఇటీవల జీవన్ రెడ్డిని కలసి మంత్రి దామోదర రాజనర్సింహ చేసి వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు, పార్టీ కోసం ఎంతో చేశారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని వదులుకోదంటూ మద్దతుగా నిలబడ్డారు. ఇలా రేవంత్ వర్గం మంత్రులు జీవన్ రెడ్డికి అంటి ముట్టనట్లు ఉంటే, సీనియర్లు మాత్రం మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారట. ఇలాంటి టైంలో తాను స్పందిస్తే రెండు వర్గాలుగా మారి పరిస్దితి మరింత చేయిదాటుందని భావించిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బిఆర్‌ఎస్ నుంచి వస్తున్నారుగా రారమ్మంటూ సంజయ్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి, ప్రతిపక్షానికి షాకిచ్చామనే ఆనందం ఓవైపు, తీరా పార్టీలోకి వచ్చాక జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు , జీవన్ రెడ్డితోపాటు సీనియర్ల నుంచి వస్తున్న విమర్శలు రేవంత్ కి తలనొప్పిగా మారాయట.





















