(Source: ECI/ABP News/ABP Majha)
Harish Rao: అగ్గిపెట్టే హరీష్ అంటూ కాంగ్రెస్ ట్రోలింగ్- సీన్‌లోకి వచ్చి కేటీఆర్ సరికొత్త సవాల్- రంజుగా రుణమాఫీ రాజకీయం
Telangana: హరీష్ రాజీనామా ఎప్పుడంటూ కాంగ్రెస్ ట్రోలింగ్ చేస్తుంటే రైతులనే కాదు దేవుళ్లను కూడా రేవంత్ మోసం చేశారని బీఆర్‌ఎస్ కౌంటర్ ఇస్తోంది. మొత్తానికి రెండు పార్టీల మధ్య రుణమాఫీ వార్ షురూ అయింది.
Congress Vs Harish Rao: రుణమాఫీ రాజకీయం తెలంగాణలో చాలా తీవ్రంగా సాగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీచేసామని కాంగ్రెస్ చెబుతుంటే... చెప్పిన హామీ అమలు చేయకుండా కోతలు పెట్టి మోసం చేశారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. మాఫీ చేయడానికి ముందు విసిరిన సవాళ్లను ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. రాజీనామా ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తోంది.
రుణమాఫీ గడువు ఆగస్టు 15తో పూర్తి అయింది. ఆఖరి విడత రుణమాఫీని అదే రోజు చేసినట్టు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దేశ చరిత్రలోనే ఎవరూ ఎప్పుడూ చేయని విధంగా రుణమాఫీ చేసి చూపించామన్నారు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 నాటి స్పీచ్‌లో కూడా దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ గతంలో సవాల్ చేసినట్టు హరీష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.
ఆగస్టు 15 ఇలా వెళ్లిందో లేదో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలు పెట్టారు కాంగ్రెస్ నేతలు. అగ్గిపెట్టె హరీష్‌రావు అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. చెప్పినట్టు రుణమాఫీ చేశామని తమకు రాజీనామా ఎప్పుడు చేస్తారని ఆ ఫ్లెక్సీల్లో ప్రశ్నిస్తున్నారు.
రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీష్‌రావును టార్గెట్ చేశారు.
దమ్ముంటే...
— Congress for Telangana (@Congress4TS) August 16, 2024
రాజీనామా చెయ్... pic.twitter.com/ncmp7YJk7S
ప్రజలు ఫుట్‌బాల్ ఆడుకుంటారు: కేటీఆర్
దీనిపై అదేస్థాయిలో కౌంటర్ ఇస్తోంది. నువ్వు చేసిన రుణమాఫీ నిజమైతే…నీ నియోజకవర్గానికే మీడియాతో కలిసి వెళ్దామని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. ఒక్క రైతు వేదికలో వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా రాజకీయాలు వదిలేస్తానంటూ ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ పచ్చిమోసాన్ని ఎండగడతామన్నారు. సీఎంకు దమ్ముంటే సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే రేవంత్ రెడ్డిని ప్రజలు ఫుట్బాల్ ఆడతారని అన్నారు. సగం కూడా రుణమాఫీ చేయకుండా మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెబితే అది సంపూర్ణంగా దిగజారటమేనన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసినందుకు సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి అని విమర్శించారు.
బీఆర్‌ఎస్. ఇప్పటికే గురువారం మాట్లాడిన ఆయన ఇలాంటి దిక్కుమాలిన సీఎంను ఎప్పుడూ చూడలేదని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ట్రోలింగ్‌కు మరింతగా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రేవంత్ రెడ్డి రైతులనే కాకుండా దేవుళ్లను కూడా మోసం చేశారన్న ట్యాగ్‌లైన్‌తో పోరుకు సిద్ధమవుతోంది.
రుణమాఫీ చేస్తామంటూ అప్పట్లో రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా చాలా దేవుళ్ల వద్ద ఒట్లు వేశారు. దీన్నే కౌంటర్‌గా వాడుకోవాలని చూస్తున్నారు హరీష్. రేవంత్ రెడ్డి ఒట్లు వేసిన దేవుళ్ళ వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చినట్టు భేషరతుగా రుణమాఫీ అమలు చేయకపోవడంపై ఆగ్రహంతో ఉన్న హరీష్ మాట తప్పిన తీరును ఎండగట్టేందుకు ఈ పంథాను ఎంచుకున్నారు.
రుణమాఫీ పేరుతో రైతులను దగా చేసిన రేవంత్
— BRS Party (@BRSparty) August 16, 2024
దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా.. నిస్సిగ్గుగా బీఆర్ఎస్పై, నాపై అవాకులు చెవాకులు పేలితే అబద్ధం నిజమైపోదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥 pic.twitter.com/OiuetNYH0h
పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా రుణమాఫీపై ఎలాంటి ప్రకటన చేయలేదని మూడు నెలల క్రితం బీఆర్‌ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ నడిచింది. ఆ టైంలో విమర్శలు ప్రతి విమర్శలే కాకుండా సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా సాగాయి. అదే టైంలో ఆగస్టు 15 డెడ్‌లైన్‌గా పెట్టుకున్నామని ఆ లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రేవంత్ రెడ్డి ఒట్లు వేసిన దేవుళ్ళ వద్దకు వెళ్లి ప్రార్థన చేయనున్న హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2024
సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చి ఆగస్ట్ 15న రుణమాఫీ అమలు చేయక పోవడం పట్ల హరీష్ రావు ఆగ్రహం
మాట తప్పిన రేవంత్ తీరును బట్టబయలు చేసేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ
రుణమాఫీ మాట తప్పిన నేపథ్యంలో రేవంత్ ఒట్లు వేసిన… pic.twitter.com/8OVUk0Og4w
ఆ లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్ చేశారు. దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ సవాల్‌ను స్వీకరించారు. ఆగస్టు 15లోపు చేయకుంటే రాజీనామా చేస్తామన్నారు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా మూడు విడతలుగా రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 15 లోపు మొత్తం ప్రక్రియ పూర్తి చేసినందుకు సవాల్‌కు కట్టుబడి హరీష్‌రావు రాజీనామా చేయాలని రేవంత్ వైరా సభలో డిమాండ్ చేశారు. అందుకే హరీష్‌రావు రాజీనామా కేంద్రంగానే