News
News
X

తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్‌ఏ చర్చలు సఫలం- నేటి నుంచి విధుల్లోకి ఉద్యోగులు

80 రోజులుగా తెలంగాణలో వీఆర్‌ఏలు చేస్తున్న సమ్మెకు శుభం కార్డు పడింది. నిన్న సీఎస్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

FOLLOW US: 

రెవెన్యూ శాఖలో గత 80 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించడంతో చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం, ట్రెసా ప్రతినిధులు, వీఆర్ఏ జేఏసీ నాయకుల మధ్య నిన్న సాయంత్రం చర్చలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆయన ఛాంబర్‌లో ట్రెసా నాయకులు, విఆర్ఏ జేఏసీ ప్రతినిధులు, సీఐటీయూ నాయకులు సుమారు అర గంటకుపైగా చర్చించారు. 

ట్రెసా, వీఆర్ఏ జేఏసీ లేవనేత్తిన ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్టు వీఆర్‌ఏ, ట్రెసా ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన వీఆర్ఏల పే స్కేల్, అర్హులైన వారికి పదోన్నతులు, వయోపరిమితి మీరిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు, వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించడం, సమ్మె కాలానికి వేతనం, సమ్మె కాలంలో చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వంటి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. 
ముఖ్యమంత్రితో చర్చించి వచ్చే నెల 7లోపు మరోసారి పిలిచి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని సీఎస్‌ చెప్పినట్టు తెలిపారు. 

సీఎస్‌ హామీతో సంతృప్తి చెందిన విఆర్ఏ జేఏసీ నాయకులు ట్రెసా ప్రతినిధుల సమక్షంలో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఇవాల్టి నుంచి వీఆర్ఏలంతా విధుల్లో చేరతున్నట్టు వెల్లడించారు. 

Published at : 13 Oct 2022 12:15 AM (IST) Tags: Telangana CS VRA Telangana

సంబంధిత కథనాలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

Minsiter Harish Rao : సర్కార్ దవాఖానల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లు, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Minsiter Harish Rao : సర్కార్ దవాఖానల్లో  56 టిఫా స్కానింగ్ మిషన్లు, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి