By: ABP Desam | Updated at : 10 Sep 2021 12:53 PM (IST)
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ఏపీ, తెలంగాణలో గణేశుడి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ వినాయకుడి వద్ద సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గణపతి బప్పా మోరియా అంటూ ఆ ప్రాంగణమంతా గణేశుడి నామస్మరణతో మార్మోగింది.
తెల్లవారుజామునే ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జంటనగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయకుడికి భక్తులు గజమాల సమర్పించారు. ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సంఘం కండువా, జంజం, గరికమాల సమర్పించింది. ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజను గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయలు చేశారు. అర్చకుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాల మధ్య విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరు రాష్ట్రాల గవర్నర్లకు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికింది.
ఖైరతాబాద్ గణేశుడిని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించకుండా గణపయ్యను దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ సూచించింది.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. రేపు ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 12న నెమలి, 13న మూషిక, 14న శేషవాహన సేవలు, అలాగే 15న ఉదయం చిలుక, రాత్రి వృషభ సేవలు, 16న గజ, 17న రథోత్సవం జరపనున్నారు. ఈ నెల 18న తిరుకల్యాణం, అశ్వవాహన సేవ , 19న తీర్థవారి త్రిశూల స్నానం, వడాయత్తు ఉత్సవం జరిపి ఏకాంత సేవతో వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ యాగశాలలో శాస్త్రోక్తంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవ పూజలను ఆలయ ఈవో లవన్న, అర్చకులు ప్రారంభించారు. సాక్షి గణపతి ఆలయం వద్ద మృత్తిక గణపతిని ఏర్పాటు చేశారు. సాక్షి గణపతిస్వామికి వ్రతకల్ప పూర్వక పూజలు చేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 19 వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
Also Read: Ganesh Chaturthi 2021: వినాయక చవితి పూజ ఎలా చేయాలి.. అసలు మంత్రాలు ఏంటి?
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, వివరాలు ఇలా!
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది