అన్వేషించండి

TSRTC Special Package: టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్- అరుణాచల గిరి ప్రదక్షిణకు స్పెషల్ బస్ సర్వీస్

TSRTC Buses for Arunachalam Giri Pradakshina: తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. 

TSRTC Tour Package for Arunachalam Giri Pradakshina
హైదరాబాద్‌: గురు పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది.  జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని టీఎస్ ఆర్టీసీ (TSRTC) నిర్ణయం తీసుకుంది. గురుపౌర్ణమి సమయంలో భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణకు పెద్ద సంఖ్యలో వెళ్తారు. దాంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సు ప్యాకేజీ పూర్తి వివరాలను టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. ఆసక్తి గల భక్తులు తమ సర్వీసులు వినియోగించుకుని, అ చేయాలనుకునే భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణను సులభతరం చేసుకోవాలని సూచించారు. అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా టీఎస్ఆర్టీసీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2600గా సంస్థ నిర్ణయించింది. 

టీఎస్ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ వివరాలిలా..
- జులై 3న అరుణాచల గిరి ప్రదర్శన సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కొత్త టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. 
సర్వీసు నంబర్ 98889 బస్సు జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి  స్టార్ట్ అవుతుంది.
- ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని వినాయకుడి దర్శనం చేసుకుంటారు. అదే రోజు రాత్రి 10 గంటలకు బస్సు అరుణాచలం చేరుకుంటుంది. 
- జులై 3 గిరి ప్రదర్శన పూర్తి చేసుకున్నాక.. అదే రోజు సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కు భక్తులను తీసుకెళ్తారు. అక్కడ దర్శనానంతరం.. బయలుదేరి హైదరాబాద్ కు మరుసటి రోజు (జులై 4న) ఉదయం 10 గంటలకు ఈ బస్సు చేరుకుంటుంది. 
Also Read: TSRTC: తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన 'టి-9 టికెట్‌'- ఒక్కొక్కరికి రూ.40 వరకు ఆదా

‘గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు భక్తుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. ఎంబీజీఎస్, జేబీఎస్ (JBS), దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959226257, 9959224911 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు.
Also Read: T-24 Ticket Price Hike: హైదరాబాద్‌ ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ - టీ-24 టికెట్ ధరలు పెంపు 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget