Traffic Diversions: హైదరాబాదీలు జర చూస్కొని వెళ్లండి - నగరంలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Diversions: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆఁక్షలు విధించారు. నేడు, రేపు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు తెలిపారు.
Traffic Diversions: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నేడు, రేపు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులతో గుడుల సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఈక్రమంలోనే ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే వారు త్వరగా ఇళ్ల నుంచి బయలుదేరాలని సూచించారు. అదే విధంగా ప్లాట్ ఫామ్ నెంబర్.1 నుంచి వెళ్లే వారు రద్దీ ఎక్కువ ఉండడంతో చిలకలగూడ వైపు నుంచి వచ్చి ప్లాట్ ఫామ్ నంబర్.10ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆలయానికి రెండు కిలో మీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
Commuters are urged to make note of Traffic Arrangements in view of Sri Ujjaini Mahankali Bonalu on 8/9 and 10th of July '23.
— Raju K P V (@InsAdmnHYDTP) July 8, 2023
Kindly as much as avoid commuting between Junctions: Paradise -Patny- Ghansmandi - Ranigunj.@HYDTP pic.twitter.com/wfjU0WVsKY
ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కెడెక్కడ అంటే..?
- మహంకాళి ఆలయం, టోబాకో బజార్, హిల్ స్ట్రీట్ రూట్ లో ట్రాఫిక్ రాకపోకలు పూర్తిగా నిలిపివేసి రోడ్లను మూసి వేస్తారు.
- సుభాష్ రోడ్డు, బాటా చౌరస్తా, రాంగోపాల్ పేట పీఎస్, సికింద్రాబాద్ మార్గాలను మూసివేస్తారు.
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సెయింట్ మేరీ రూట్ల మార్గాలను కూడా మూసివేస్తారు.
- అలాగే అడవయ్ రోడ్డు మార్గాలను కూడా పూర్తిగా మూసివేస్తారు.
- జనరల్ బజార్ నుంచి ఆలయ మార్గం రోడ్డు కూడా మూసేస్తారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) July 7, 2023
Commuters are urged to note the #Trafficdiversions & #parking arrangements in view of Sri Ujjaini Mahankali Bonalu Jatara at Secunderabad on 08/09-07-2023 till the conclusion on 10-07-2023.#Bonalu #Bonalu2023 #FESTIVAL pic.twitter.com/3hBHalNA7I
Pl commute in the green stretch shown in the Map. pic.twitter.com/rVoDifEUCL
— Raju K P V (@InsAdmnHYDTP) July 8, 2023
దాళి మళ్లింపులు ఏయే ప్రాంతాల్లోనంటే?
- కర్బాలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్ ఎక్స్ రోడ్డులో, మినిస్టర్ రోడ్డు వైపు దారి మళ్లిస్తారు.
- రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ క్రాస్ రోడ్స్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ క్రాస్ రోడ్, కవాడిగూడ, మ్యారెట్ హోటల్, ట్యాంక్ బండ్ రూట్ లో వెళ్లాలి.
- అలాగే తాడ్ బండ్ వైపు వెళ్లే బస్సులు క్లాక్ టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ, ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్ మీదుగా వెళ్లాలిల.
- ఘాస్మండి క్రాస్ రోడ్స్.. బైబుల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తిరుమలగిరి వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ ఘాస్మండి ఎక్స్ రోడ్స్ నుంచి సజ్జనాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హిల్ స్ట్రీట్, రాణిగంజ్ వైపు వెళ్లాలి.
- ప్యాట్నీ ఎక్స్ రోడ్స్.. ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్స్ లో ప్యారడైజ్, మినిస్టర్ రోడ్డు లేదా క్లాక్ టవర్, సంగీత్ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్, కవాడిగూడ, మ్యారెట్ హోటల్, ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలి.
- ప్యారడైజ్ ఎక్స్ రోడ్స్.. సీటీఓ జంక్షన్ నుంి రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ ఎక్స్ రోడ్డులో సింధి కాలనీ, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్, కర్బాలా మైదన్ వైపు మళ్లిస్తారు.
- ప్యాట్నీ క్రాస్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్ ను ప్యారడైజ్ ఎక్స్ రోడ్స్ వద్ద సీటీఓ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్, ఐమ్యాక్స్ రోటరీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్ బండ్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, గాంధీ హాస్పిటల్, చిలకలగూడ క్రాస్ రోడ్డు, ప్లాట్ ఫామ్ నంబర్ 10కు రాకపోకలు సాగించాలి.
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఓల్డ్ గాంధీ ఎక్స్ రోడ్స్, మోండా మార్కెట్, ఘాస్మండి, బైబిల్ హౌస్, కర్బాలా మైదాన్, ట్యాంక్ బండ్ రూట్లలో రాకపోకలు సాగించాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ ప్యారడైజ్, బేగంపేట్, పంజాగుట్ట రూట్లలో వెళ్లరాదు. ఆ రూట్లలో భారీగా రద్దీ ఉంటుంది.
- ఉప్పల్ నుంచి పంజాగుట్ట వైపు రాకపోకలు సాగించే వారు ఉప్పల్, రామాంతపూర్, అంబర్ పేట్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ జంక్షన్, పంజూగుట్ట రూట్లను ఉపయోగించాలి. అయితే ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ రూట్లలో భారీగా ట్రాఫిక్ ఉంటుంది.
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్ పల్లి, బాలా నగర్, అమీర్ పేట వెళ్లే వాహనాలు క్లాక్ టవర్ నుంచి వయా ప్యాట్నీ, ఎస్బీహెచ్ వైపు నుంచి వెళ్లాలి.