Revanth Reddy: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలతో క్వారంటైన్‌లోకి టీపీసీసీ చీఫ్
నిన్నటి నుండి జ్వరంతో బాధపడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
Revanth Reddy Tested Positive for Covid19: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆయన నిన్నటి నుండి జ్వరంతో బాధపడుతున్నారు. అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోగా కరోనా ఉన్నట్టు తేలిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో కోరారు. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన చెందవద్దని పార్టీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం నాడు 21,679 శాంపిల్స్‌కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 274 మందికి కరోనా పాజిటివ్ గా డాక్టర్లు నిర్ధారించారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత డిసెంబర్ నుంచి తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. వీటి సంఖ్య సైతం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 1.26 శాతంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
I have tested positive for covid with mild symptoms. Those who came in contact with me over the last few days, kindly take necessary precautions. #Covid_19
— Revanth Reddy (@revanth_anumula) January 3, 2022
మరోవైపు చిచ్చురేపుతున్న జగ్గారెడ్డి..
తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి వివాదం రోజురోజుకూ ముదురుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సరిగాలేదంటూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ సంచలనంగా మారింది. జగ్గారెడ్డి లేఖ మీడియాకు లీకు కావడంతో పార్టీ నేతల మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు సైతం జరుగుతున్నాయి. మరోవైపు ఇవేమీ పట్టించుకోకుండా దీక్షలు, నిరసనలలో రేవంత్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. టెస్టులు చేయించుకోగా కొవిడ్19 పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు.
Also Read: Karimnagar: కరీంనగర్ లో హైడ్రామా... బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం... అరెస్టు చేసిన పోలీసులు
Also Read: LB Nagar Youth Fight: మద్యం మత్తులో యువకులు వీరంగం... ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు... ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి