Hyderabad Rains: పిడుగులా? బాంబులా? భూకంపమా?- వేకువజామున శబ్దాలకు నిద్రలోంచి లేచి కూర్చున్న హైదరాబాద్ వాసులు
Hyderabad Weather: ఉదయాన్నే పిడుగలతో హైదరాబాద్ దద్దరిల్లింది. జోరువానకు పిడుగులు తోడై చాలా ప్రాంతాల్లో జనాలకు కునుకు లేకుండా చేశాయి.
Hyderabad: రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలు జనాలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బయటకు వెళ్లేందుకు కాస్త గ్యాప్ ఇస్తూనే కాసేపటికే కుంభవృష్టి కుమ్మేస్తోంది. రాత్రి వరకు కురిసిన వర్షం ఒకలా ఉంటే వేకువ జామున కురిసిన వర్షం మాత్రం నగరవాసులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.
హైదరాబాద్‌లో వెదర్‌మ్యాన్ చెప్పినట్టు నగరవాసులు ఎప్పుడూ ఫేస్ చేయని డిఫరెంట్ సిఛ్యుయేషన్ ఫేస్ చేశారు. మియాపూర్ మెట్రో డిపోకు దగ్గరగా ఉండే వాళ్లకు ఇది మరింత భయంకరంగా అనుభవమైన ఘటన. వేకువ జామున కురుస్తున్న వర్షానికి మంచి నిద్రలో ఉండగానే నెత్తిన బాంబుల వర్షం కురిసినట్టు వచ్చిన శబ్దాలు వచ్చాయి. ఉలిక్కిపడి లేచిన జనానికి ఏం జరిగిందో అర్థం కాలేదు.
పడింది పిడుగని తెలుసు కానీ ఆ స్థాయి శబ్ధం ఎప్పుడూ వినలేదని అంటున్నారు మియాపూర్ ప్రాంత వాసులు. అవును అదే విషయాన్ని వాతావరణ నిపుణులు కూడా నిర్దారిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత భారీ స్థాయిలో పిడుగులు పడ్డాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా సోషల్ మిడియాలో పెడుతున్నారు.
తెల్లవారుజామున 5.44 గంటల సమయంలో మెట్రో డిపోకు సమీపంలో 516KA సామర్థ్యంలో ధడేల్‌మని పిడుగు పడింది. ఇది నెవ్వర్ బిఫోర్ అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. గతంలో చాలా సార్లు పిడుగు పడ్డాయని అయితే వాటి సామర్థ్యం మాత్రం 200 KA దాటలేదని చెబుతున్నారు. తొలిసారిగా ఈ స్థాయిలో పిడుగులు పడ్డాయని చెబుతున్నారు.
మూడు ప్రాంతమంతాపిడుగులతో వేకువ జామున దద్దరిల్లిపోయింది. అయితే 516 KA సామర్థ్యంలో పడిన పిడుగు మాత్రం ఇళ్లను షేక్ చేసింది. కిటికీలు ఊగిపోయాయి. రోడ్లపై పార్క్ చేసిన కారు అలారమ్స్ మోతెక్కిపోయాయి. భూమి ఒక్కసారి కంపించిపోయింది.
దీనిపై అధికారులు మాత్రం ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సాంకేతికతను ఉపయోగించి వెదర్ రిపోర్టులు చెప్పే వాతావరణ నిపుణులు మాత్రమే ఈ విషాయన్ని ధ్రువీకరిస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.