అన్వేషించండి

Hyderabad: ఇదెక్కడి చోద్యం!! ఒకే నెంబరుతో మూడు ఆర్టీసీ బస్సులు.. ఎలా బయటపడిందో తెలుసా?

ఒకే నెంబరుపై ఉన్న ఈ మూడు బస్సులకు హైదరాబాద్ పరిధిలో రెండు ట్రాఫిక్ చలాన్లు, సైబరాబాద్ పరిధిలో మరో రెండు చలాన్లు ఉన్నాయి.

ఒకే నెంబరుతో రెండు వాహనాలు ఉండడం నేరం అనే సంగతి తెలిసిందే. సాధారణంగా నేరస్థులు, పోలీసులను బురిడీ కొట్టించాలనుకొనే దొంగలు ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తుంటారు. ఒకే నెంబరుతో రెండు లేదా మూడు వాహనాలు ఉన్నాయంటే.. అవి సక్రమంగా రిజిస్ట్రేషన్ కానట్లే లెక్క. ఎక్కువగా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఇలాంటి పనులు చేస్తుంటాయి. అంటే ప్రభుత్వ ఆదాయం గండీ పడ్డట్లే. అయితే, ఇలాంటి పనులు నేరస్థులు చేస్తుండడం అక్కడక్కడా చూస్తుంటాం. కానీ, ఏకంగా తెలంగాణ ఆర్టీసీలో జరిగితే..! ఒకే నెంబరుతో ఏకంగా 3 ఆర్టీసీ బస్సులు కనిపించడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రభుత్వానికి చెందిన బస్సుల్లో ఇలాంటి మాయాజాలం కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గరుడ ప్లస్, ఎక్స్‌ప్రెస్ సహా మరో ఏసీ బస్సుకు ఒకే నెంబర్ ఉంది. ఈ విషయం బయటికి ఎలా వచ్చిందంటే.. ఆ మూడు బస్సుల మీద ఫైన్లు ఉన్నాయి. ఆ బస్సు నెంబరుతో ఈ-చలానా వెబ్‌సైట్‌లో వెతకగా.. ఏకంగా మూడు బస్సులు వివిధ చోట్ల ట్రాఫిక్ నిబంధనలు మీరినట్లు ఫలితం వచ్చింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ వన్ డిపోలో టీఎస్ 08 Z 0208 నంబర్‌తో ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌గా నడుస్తోంది. హైదరాబాద్ 3 డిపోలోని గరుడ ప్లస్ సర్వీస్‌ కూడా అదే నంబర్‌పై తిరుగుతుంది. అంతేకాక, ఇంకో స్కానియా కంపెనీకి చెందిన మరో ఏసీ బస్సు కూడా ఇదే నెంబరుతో ఉంది.

Also Read: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ

ఒకే నెంబరుపై ఉన్న ఈ మూడు బస్సులకు హైదరాబాద్ పరిధిలో రెండు ట్రాఫిక్ చలాన్లు, సైబరాబాద్ పరిధిలో మరో రెండు చలాన్లు ఉన్నాయి. రాచకొండ, ఆదిలాబాద్, సిద్ధిపేట, కరీంనగర్ పరిధిలోనూ ఒక్కో చలాన్ చొప్పున ఉంది. మొత్తం ఒకే నెంబరుపై ఉన్న మూడు బస్సులపై 8 చలాన్లు ఉన్నాయి. అయితే, బస్సులు మాత్రం మూడు ఉండడం గమనించిన ఆర్టీవో అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఆ బస్సులకు ఒకే నెంబర్ ఎందుకు కేటాయించారనేది మాత్రం అర్థం కావడం లేదు.Hyderabad: ఇదెక్కడి చోద్యం!! ఒకే నెంబరుతో మూడు ఆర్టీసీ బస్సులు.. ఎలా బయటపడిందో తెలుసా?

Also Read: Gold-Silver Price: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల

సాధారణంగా ప్రైవేటు ట్రావెల్స్ నడిపేవారు ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతుంటారు. ఒకే నెంబరుకు అనుమతులు తీసుకొని అదే నెంబరుతో రెండు మూడు బస్సులు లేదా నాలుగు బస్సులు నడుపుతుంటారు. ఇలాంటి వ్యవహారాలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. దొరికినప్పుడల్లా ఆర్టీఏ అధికారులు ఫైన్లు కూడా వేస్తుంటారు. తాజాగా టీఎస్ఆర్టీసీలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ- గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ- గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
Harish Rao: ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం నిలదీయండి.. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే
ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం నిలదీయండి.. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే
Telangana Congress InCharge: మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep- ఇంతకీ ఎవరీయన
మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep నియామకం- ఇంతకీ ఎవరీయన
Rahul Gandhi: దేశంలో ఫాసిస్టులు ఆగడాలు పెరిగిపోయాయ్.. భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలో ఫాసిస్టులు ఆగడాలు పెరిగిపోయాయ్.. భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
SpaceX Starship Flight 15: అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
Tiger Tension: ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Embed widget