Telangana Shyam: బీజేపీ అండతో నన్ను చంపేందుకు కుట్ర.. గో బ్యాక్ మార్వాడీ ఆగదు: ABP దేశంతో తెలంగాణ శ్యామ్
Go back Marwadi ఉద్యమం తెలంగాణలో రగులుతూనే ఉంది. మార్వాడీలకు మద్దతుగా బిజేపి, వ్యతిరేకంగా ఓయూ జేఏసి, ప్రజా సంఘాలు.. ఇలా నిరసనల జోరు కొనసాగుతోంది. ఈ వివాదానికి ఆద్యం పోసిన తెలంగాణ శ్యామ్ ఇంటర్వూ

ఏబిపి దేశం.. తెలంగాణలో మీరు రేపిన గో బ్యాక్ మార్వాడీ చిచ్చు, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు, ఆందోళనలకు కారణమైయ్యింది. ఎందుకు గోె బ్యాక్ మార్వాడీ (Go back Marwadi).. కారణాలేంటి..?
తెలంగాణ శ్యామ్..
గో బ్యాక్ మార్వాడీ అంటే ఇక్కడ మనుషులను తెలంగాణ రాష్ట్రం వదలి వెళ్లమని మా ఉద్దేశ్యం కాదు. ఇక్కడ వ్యాపారాలు పూర్తిగా మానేయ్యమని కాదు. ఆంధ్రా ,తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు , మా నీళ్లు, నిధులు, నియామకాలకోసం మా ప్రక్కనే ఉన్న తెలుగు వాళ్లతోనే పోరాటం చేశాం. వందలాది మంది కేసుపాలైయ్యారు. అనేక మంది అమర వీరులైయ్యారు. అప్పుడు గో బ్యాక్ అన్నప్పుడు లేని బాధ ,ఇప్పుడు ఎందుకు గో బ్యాక్ మార్వాడీ అంటే వస్తోందో అర్దం కావడంలేదు. ప్రధానంగా తెలంగాణలో స్వర్ణ కారులు, చేనేత కార్మికులు, వుడ్ వర్క్ చేసేవాళ్లు, విగ్రహాలు తయారు చేసేవాళ్లు, కొమటి వాళ్లు, మాదిగవాళ్లు.. ఇలా వివిధ కుల వృత్తులపై దశాబ్ధాలుగా ఆధారపడి జీవిస్తున్న కులాలపై మార్వీడల ప్రభావం తీవ్రంగా పడింది.
2014 లో తెలంగాణ సాధించిన నాటి నుండి చిన్నచిన్న గ్రామాలకు సైతం మార్వాడీలు వ్యాపారాల పేరుతో విస్తరించారు. సుమారు 500పైగా గ్రామాలకు మార్వాడీలు వెళ్లి, అక్కడి కుల వృత్తులను, ఉపాధిని దెబ్బకొడుతున్నారు. మార్వాడీలు వ్యాపారాలు పెట్టుకోవడం తప్పుపట్టడంలేదు. కానీ వాళ్ల వ్యాపారాలలో స్ధానికులైన తెలంగాణ వారికి 80శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మా ప్రధాన డిమాండ్. ఇటీవల మోండా మార్కెట్ లో ఓ దళితుడిపైన , కొందరు మార్వడీ వ్యాపారులు అన్యాయంగా దాడి చేశాడు.అడ్డుకోబోయిన ఇతర కులాకు చెందిన స్దానికులపై సైతం కులం పేరుతో దూషించి, దాడికి చేశారు. ఈ ఘటతోనే గో బ్యాక్ మార్వాడీ అనే నినాదం ఇచ్చిన మాట వాస్తవం. కాల్ ఇచ్చాం..అనేక ప్రజా ఉద్యమాలలో సైతం అన్యాయం జరిగితే ఎదిరిస్తాం. అదే చేశాం.
ఏబిపి దేశం..
మీరు పెట్టిన స్దానిక ,స్దానికేతర చిచ్చుతో తెలంగాణలో మార్వాడీలు ఓ అభద్రతా భావంలోకి వెళ్లిపోయారు. కొన్ని దాశాబ్ధాలుగా వాళ్లు తెలంగాణలో బ్రతుకుతున్నారు. వ్యక్తిగతంగా కొందరు చేసిన దాడిని మొత్తం మార్వాడీ సమాజానికి ఎలా మీరు ఆపాదిస్తారు..?
తెలంగాణ శ్యామ్..
ఈ ఉద్యమం మోండా మార్కెట్ లో మాత్రమే పుట్టింది కాదు. తెలంగాణలో ప్రజాసంఘలు, దళితులు, స్దానిక వ్యాపారులలో ఎప్పటి నుండో మార్వాడీలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. తెలంగాణలో మార్వాడీలు వైభవంగా అలంకరించి పండుగలు చేసుకుంటూ, అవేవో గొప్ప పండుగలుగా జనంలోకి తీసుకెళుతూ , మా తెలంగాణ బతుకమ్మ పండుగలను అవమానిస్తున్నారు. హిందీ భాషను బలవంతంగా తెలంగాణ ప్రజలపై రుద్దుతున్నారు. మాపై ఆదిపత్యం చెలాయిస్తున్నారు.
ఏబిపి దేశం..
మార్వాడీలు చేస్తున్న వ్యాపారాలను మీరెందుకు తప్పుపడుతున్నారు. దశాబ్దాల నుండి తెలంగాణలో ఉంటున్న మర్వాడీలు ఇన్నాళ్లు, తెలంగాణ సంస్కృతిని, భాషను ఏం మార్చగలిగారు. ఇప్పుడెందుకు వారిపై ఆరోపణలు చేస్తున్నారు..?
తెలంగాణ శ్యామ్..
మార్వాడీ వ్యాపారులు నకిలీ వస్తువులు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బంగారు వృత్తిపై ఆధాపడ్డ తెలంగాణ స్వర్ణకారుల వ్యాపారాలు దెబ్బకొడుతూ , నార్త్ నుండి వచ్చిన మార్వీడీలు పెద్ద ఎత్తున బంగారం తయారీ,అమ్మకాలలోె విస్తరించారు. ఈ ప్రభావంతో స్దానిక స్వర్ణకారులు ఉనికి ప్రశ్నార్దకంగా మాారింది. గ్రామాలలో స్దానిక కిరాణ షాపులను దెబ్బకొట్టేలా భారీ పెట్టుబడులతో మార్వాడీలు , కోమటి వ్యాాపారులను సైతం ఆర్ధికంగా దెబ్బకొడుతున్నారు. ఆర్దికంగా స్దానికులు వారితో వ్యాపారాలలో పోటీ పడలేకపోతున్నారు. భారీ పెట్టుబడులు పెట్టలేక ,కుల వృత్తుల మనుగడ ప్రశ్నార్దకంగా మారింది.
ఏబిపి దేశం..
మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మీకు బెదిరింపులు వస్తున్నాయా, చివరిగా మార్వాడీల విషయంలో ఏం డిమాండ్ చేస్తున్నారు..?
తెలంగాణ శ్యామ్..
నేను తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడ్ని, ఇక్కడే పుట్టా, ఇక్కడే జీవిస్తున్నా. కానీ కొందరు మార్వాడీ మద్దతుదారులు నాపై కుట్ర చేస్తున్నారు. నేను తెలంగాణ వాడ్ని కాదని, చెన్నైలో రాజకీయాలు చేశానని ఆరోపిస్తున్నారు. మరికొందరు మార్వాడీలు నాకు కాల్ చేసి ఏకంగా చంపేస్తామని బెదిరిస్తున్నారు. కోట్లాదిరూపాయల ఆస్తులున్న మార్వాడీలతో నాకు ప్రాణ హాని ఉంది. నన్ను లారీతో గుద్దించి చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు మార్వాడీల నుండి రక్షణ కల్పించాలి. నా ఈ ఉద్యమం మార్వాడీలకు వ్యతిరేకం కాదు,వారు అవలంభిస్తున్న వ్యాపార విధానాలకు వ్యతిరేకం. స్దానికులకు 80శాతం ఉపాధి అకాశాలు కల్పించి, తెలంగాణలో న్యాయంగా వ్యాపారం చేసుకుంటే తప్పులేదు. అదే డిమాండ్ చేస్తున్నాను.





















