అన్వేషించండి

Marwari Go Back slogan: తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ వివాదం - కుట్ర ఉందంటున్న బీజేపీ - అసలేం జరుగుతోంది?

Telangana: తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ నినాదం పెరుగుతోంది.అయితే ఇలా పిలుపునివ్వడం కుట్ర అని బీజేపీ నేతలు అంటున్నారు.

Marwari Go Back Politics: హైదరాబాద్ శివారులోకి వచ్చేసిన అమనగల్లులో.. ఓ దుకాణం ముందు పార్కింగ్ గురించి గొడవ జరిగింది. బండి పార్కింగ్ చేసిన యువకుడితో దుకాణాదారుడు గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవలో దుకాణయజమాని బంధువు.. బండిని పార్కింగ్ చేసిన వ్యక్తిని కొట్టాడు. ఆ వివాదం ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే నినాదానికి కారణం అయింది. ఆ దుకాణదారుడు మార్వాడీ.. పార్కింగ్ వివాదంలో అతను కొట్టింది.. ఓ దళితయువకుడ్ని.  ఘర్షణ పడినప్పుడు వారికి సంబంధించిన ఈ వివరాలేమీ వారికి తెలియవు కానీ.. ఇప్పుడు వాటితోనే అసలు వివాదం ప్రారంభమయింది. 

18న అమనగల్లు బంద్ - మార్వాడీ గోబ్యాక్ నినాదం

అమనగల్లులో మార్వాడీల వ్యాపారాలు ఎక్కువ అయిపోయాయని స్థానికలకు వ్యాపారాలు లేకుండా మొత్తం వారే అక్రమించుకుంటున్నారని..పైగా దోచుకుంటున్నారని , దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ..అమనగల్లు బంద్ కు పిలుపునిచ్చారు. ఇది మెల్లగా రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోంది. చాలా మంది మార్వాడీ గోబ్యాక్ నినాదాలను సోషల్మీడియాలో చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్లా మార్వాడీలే ఉంటున్నారని.. తెలంగాణ ప్రజలకు చిరు వ్యాపారాలకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని..  ప్రతి చిన్న ఊరిలోకి వచ్చి వ్యాపారాలు పెట్టేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. 

ఈ ప్రచారం వెనుక కుట్ర ఉందన్న బండి సంజయ్ 
   
తెలంగాణలో మార్వాడీ వ్యాపారులు  ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు కిరాణా దుకాణాల నుంచి   నిర్మాణ సామాగ్రి , స్వీట్ షాపులు, హోటళ్ల వరకూ  విస్తరించారు.   వీరి వల్ల  స్థానిక తెలంగాణ వ్యాపారులు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు, మార్వాడీలు తమ వ్యాపార అవకాశాలను ఆక్రమిస్తున్నారని, తద్వారా తమ జీవనోపాధి దెబ్బతింటోందన్న విమర్శలు అప్పుడప్పుడూ వస్తున్నాయి. ఇప్పుడు పార్కింగ్ వివాదంతో పెద్దదయింది.  ఈ తరహా ప్రచారంపై బీజేపీ కుట్ర ఉందని అంటోంది.    మార్వాడీలను లక్ష్యంగా చేయడం కంటే, అక్రమ బంగ్లాదేశీలు ,  రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.   ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని  ఈ ప్రచారాన్ని రాజకీయంగా  ఆరోపిస్తున్నారు. 

హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రనా ? 

మార్వాడీలపై వ్యతిరేక ప్రచారం హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా పేర్కొంటున్నారు.  బీజేపీ మార్వాడీలకు మద్దతు ప్రకటించింది.  కాంగ్రెస్ పార్టీ ఇతరుల్ని రెచ్చగొడుతోందని అంటున్నారు.  అయితే ఇప్పటి వరకూ నేరుగా కాంగ్రెస్ ఈ వివాదంపై స్పందించలేదు. భారత రాష్ట్ర సమితి కూడా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజకీయంగా లాభనష్టాలు బేరీజులు వేసుకుని పార్టీలు రంగంలోకి దిగే అవకాశం ఉంది.  కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
Villa Orchids Security Failure: కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget