By: ABP Desam | Updated at : 27 Mar 2023 02:56 PM (IST)
ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారించిన విధానంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మూడు వారాల తర్వాత విచారిస్తామని తెలియజేసింది. లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించాలని కోర్టు చెప్పింది. కవిత, ఈడీకి రెండు వర్గాలకు ఆదేశాలు ఇచ్చింది. కవిత తరఫున కపిల్ సిబాల్ వాదించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది.
ఈడీ తరపున విజయ్ మండల్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో పిటిషన్ దారు కోరుతున్న వెసులుబాటు పీఎంఎల్ఏ (Prevention of Money Laundering) కేసుల్లో వర్తిందని అన్నారు. ఈ చట్టం కింద విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉందని తెలిపారు.
కవిత తరపున సీనియర్ లాయర్ కవిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈడీ కార్యాలయానికి పిలిచే విషయంలో అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను ఓసారి పరిశీలించాలని అన్నారు. ‘‘ఈ కేసులో కవిత నిందితురాలు కాదు. సమన్ల విషయంలో ఈడీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాలేదు. చార్జిషీట్ ఇప్పటికే దాఖలు చేశారు. నళిని చిదంబరం కేసులతో దీన్ని ట్యాగ్ చేయండి’’ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా అన్నింటినీ లోతుగా విచారణ చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసులో చాలా కోర్ అంశాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. రాత పూర్వకంగా తమ వాదనలు సమర్పించాలని సుప్రీంకోర్టు కవిత, ఈడీ తరపు న్యాయవాదులను ఆదేశించింది.
చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ