Telangana Police Sweet Warning : పోలీసులతో రాజకీయం చేస్తే కష్టమే - నెటిజన్‌కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన హైదరాబాద్ కాప్స్
Hyderabad Police : పోలీసులకు రాజకీయాలు అంటగట్టబోయి ఓ నెటిజన్ వారి ఆగ్రహానికి గురయ్యాడు. తప్పుడు ప్రచారం చేస్తే కేసుల పాలవుతారని హెచ్చరించారు. అసలేం జరిగిందంటే ?
Telangana police Angry : రాజకీయ పార్టీల సానుభూతిపరులు జరుగుతున్న విషయాన్ని ట్విస్ట్ చేసి ప్రతీ దానికి రాజకీయం అంటగట్టేసి ఆరోపణలు చేయడం కామన్ అయిపోయింది. పోలీసులపైనా ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్ లో కొంత మంది పోలీసులు ఓ ఫ్లెక్సీని పక్కకు పెడుతున్న దృశ్యాలను పెట్టిన ఓ నెటిజన్.. పోలీసులపై ఆరోపణలకు చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నందున ఆయనకు స్వాగతం చెబుతూ వారు ఫ్లెక్సీలు కడుతున్నారని పోస్టు చేశాడు. రాజష్ ఓయూ స్కాలర్ అన్న పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ పోస్టు వచ్చింది. ఇక్కడ ట్విస్టేమిటంటే తాను స్వయంగా తెలంగాణ పోలీసుల ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేశాడు.
ఇది తెలంగాణ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు మీద ఫ్లెక్సీ పడిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున.. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, రోడ్డుపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ ఫ్లెక్సీని లేపి పక్కకి తప్పించారని.. స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వారిని శిక్షిస్తామని హెచ్చరించారు.
FactCheck:
— Telangana Police (@TelanganaCOPs) July 5, 2024
జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు మీద ఫ్లెక్సీ పడిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున.. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, రోడ్డుపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ ఫ్లెక్సీని లేపి పక్కకి తప్పించిన ట్రాఫిక్ పోలీసులు.
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయటం చట్టరీత్యా నేరం,శిక్షార్హులు. https://t.co/HBFJsx0uDF pic.twitter.com/msf9xUp5VV
సోషల్ మీడియా రాజకీయాలు ఇప్పుడు ఓవర్ అయిపోతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలపై నిందలేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ప్రచారాల వల్ల పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ జరిగింది ఒకటి అయితే.. చేస్తున్న ప్రచారం మాత్రం మరొకటి. ప్రభుత్వాన్ని రాజకీయంగా బద్నాం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల కోసం నిరంతరం పని చేసే వారిపై నిందలేయడం సమంజసం కాదని చెబుతున్నారు.
పోలీసులపై ఈ ట్వీట్ పెట్టిన రాజేష్ ఓయూ స్కాలర్ పై కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే అతను రాజకీయ పార్టీ సానుభూతిపరుడు అయినప్పుడు ఇలాంటి వాటిపై కేసులు పెట్టడం వల్ల అతని ఫ్యూచర్ దెబ్బతింటుందని ఆలోచిస్తూంటారు. కానీ ఇవి శ్రుతిమించిపోతూండటంతో కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కొన్ని వర్గాల నుంచి సోషల్ మీడియాయాలో వినిపిస్తున్నాయి.