అన్వేషించండి

Konda Surekha Comments Row: కొండా సురేఖ వివాదాన్ని ముగిద్దాం- సినీ ప్రముఖలకు కాంగ్రెస్ విజ్ఞప్తి

Telangana Congress: కొండా సురేఖ వ్యాఖ్యల వివాదానికి ఎండ్ కార్డు వేయాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలకు కాంగ్రెస్ విజప్తి చేసింది. మహిళ గురించి ఆలోచించి వదేలియాలి సూచించింది.

Congress On Telugu Film Industry: తెలుగు పరిశ్రమలో పెను దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌ చిచ్చు ఇంకా చల్లారలేదు. దీనిపై అమె ఒకడుగు వెక్కి తగ్గి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్‌ ఛాంబర్ కూడా ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వివాదానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. 

కొండాసురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నందున ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని సినీ ప్రముఖులను తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఇరు వైపుల కూడా మహిళలే ఉన్నందున అర్థం చేసుకొని శాంతించాలని కోరారు. తప్పును గ్రహించి కొండా సురేఖ వెనక్కి తగ్గారన్నారు. అందుకే వివాదాన్ని ముగిస్తే సమంజసంగా ఉంటుందన్నారు. అదే టైంలో కొండా సురేఖపై కేటీఆర్ చేసిన కామెంట్స్, ట్వీట్‌లను కూడా పరిశీలించాలని సూచించారు. 

కాంగ్రెస్ నేతలు, మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలకి కూడా మహేష్‌ కుమార్ గౌడ్ పలు సూచనలు చేశారు. వివాదాల జోలికి పోవద్దని సూచించారు. ఏదైనా విషయంపై మాట్లాడే టైంలో జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు. పదాలు వాడే క్రమంలో కంట్రోల్డ్‌గా ఉండాలన్నారు. 

Also Read: మహేష్ జోక్యంతో వెనక్కి తగ్గిన కొండా సురేఖ- కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్

మరోవైపు కేటీఆర్‌పై తీవ్రంగా విమర్శలు చేసే క్రమంలో అక్కినేని ఫ్యామిలీ, సమంతపై కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి పెను దుమారానికి కారణమయ్యాయి. ఆమె మీద ఫైర్ అవుతూ తెలుగు ఇండస్ట్రీలోని పెద్దలంతా గళం విప్పారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అటు అక్కినేని ఫ్యామిలీ కూడా తమను రాజకీయాల్లోకి లాగొద్దని అభ్యర్థించారు. సమంత కూడా ఘాటుగా స్పందించారు. 

వివాదం ముదురుతుందని గ్రహించిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బుధవారం రాత్రి కొండా సురేఖతో మాట్లాడి వివాదానికి పుల్ స్టాప్‌ పెట్టే చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో వెంటే సమంతను ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ ట్వీట్ చేశారు. తను తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే తన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన అక్కినేని నాగార్జున
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన అక్కినేని నాగార్జున
Bloodbath In Markets: స్టాక్‌ మార్కెట్లలో బ్లడ్‌ బాత్‌ - యుద్ధ భీతితో బీభత్సంగా నష్టపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో బ్లడ్‌ బాత్‌ - యుద్ధ భీతితో బీభత్సంగా నష్టపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ
Telangana High Court: ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం
ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం
Poonam Kaur: అప్పుడు పోసానిపై ఎందుకు స్టాండ్ తీసుకోలేదు... టాలీవుడ్‌ను నిలదీసిన పూనమ్ కౌర్
అప్పుడు పోసానిపై ఎందుకు స్టాండ్ తీసుకోలేదు... టాలీవుడ్‌ను నిలదీసిన పూనమ్ కౌర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన అక్కినేని నాగార్జున
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన అక్కినేని నాగార్జున
Bloodbath In Markets: స్టాక్‌ మార్కెట్లలో బ్లడ్‌ బాత్‌ - యుద్ధ భీతితో బీభత్సంగా నష్టపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో బ్లడ్‌ బాత్‌ - యుద్ధ భీతితో బీభత్సంగా నష్టపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ
Telangana High Court: ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం
ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం
Poonam Kaur: అప్పుడు పోసానిపై ఎందుకు స్టాండ్ తీసుకోలేదు... టాలీవుడ్‌ను నిలదీసిన పూనమ్ కౌర్
అప్పుడు పోసానిపై ఎందుకు స్టాండ్ తీసుకోలేదు... టాలీవుడ్‌ను నిలదీసిన పూనమ్ కౌర్
Telangana CM Revanth Reddy : ఫామ్‌ హౌస్‌లను కాపాడుకోవడానికే బీఆర్‌ఎస్ హడావుడి- కూల్చివేతలపై డ్రామాలంటూ రేవంత్ ఘాటు విమర్శలు  
ఫామ్‌ హౌస్‌లను కాపాడుకోవడానికే బీఆర్‌ఎస్ హడావుడి- కూల్చివేతలపై డ్రామాలంటూ రేవంత్ ఘాటు విమర్శలు  
Jani Master Bail: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊరట... బెయిల్ మంజూరు చేసిన కోర్టు
లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊరట... బెయిల్ మంజూరు చేసిన కోర్టు
Telangana: నటిపై కామెంట్స్- కొండా సురేఖపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోదా ? ఇదిగో క్లారిటీ
నటిపై కామెంట్స్- కొండా సురేఖపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోదా ? ఇదిగో క్లారిటీ
Devara: ఆరు రోజుల్లో రూ.396 కోట్లు - దుమ్మురేపుతున్న ‘దేవర’!
ఆరు రోజుల్లో రూ.396 కోట్లు - దుమ్మురేపుతున్న ‘దేవర’!
Embed widget