Telangana High Court: బీఆర్ఎస్ ఎంపీకి హైకోర్టులో చుక్కెదురు - ఆయన పిటిషన్ కొట్టివేత
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ నేత మదన్ మోహన్ రావు వేసిన పిటిషన్ ను కొట్టేయాలని పాటిల్ ఐఏ దాఖలు చేయగా ధర్మాసనం దాన్ని కొట్టివేసింది.
Telangana High Court: బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత మదన్ మోహన్ రావు వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని పాటిల్ హైకోర్టులో ఇంటర్లోక్యూటరీ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం పాటిల్ పిటిషన్ ను కొట్టి వేసింది. మెయిన్ పిటిషన్ అంటే మదన్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ ను రోజువారీగా వాదనలు వింటామని పేర్కొంది.
2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు 6 వేల ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. ఆయన ఎన్నిక సమయంలో ఇచ్చిన అఫిడవిట్‌లో నేరాల ప్రస్తావ లేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత మదన్ మోహన్. ఎన్నికల నియమాల ప్రకారం అఫిడవిట్‌లో నేరాల ప్రస్తావన లేకపోవడం చట్టవిరుద్దమని అన్నారు. ఇదే ఆరోపణలతో గతంలో హైకోర్టులో కేసు వేశారు కాంగ్రెస్ నేత మదన్ మోహన్. కానీ దీన్ని విచారించిన హైకోర్టు కోర్టులో మెరిట్ లేదని కేసు కొట్టేసింది. అప్పట్లో ఈ కేసును న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి విచారించారు.
హైకోర్టు తీర్పుతో సంతృప్తి చెందని మదన్‌మోహన్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు చివరకు విచారణకు ఆదేశించింది. పాటిల్ అభ్యర్థిత్వంపై అఫిడవిట్‌పై ఆరునెలల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. పైన కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ వేసిన కేసును పునపరిశీపన చేసి ఆరు నేలలలో వేగవంతంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే బీబీ పాటిల్ టిఆర్ఎస్ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయనపై ఉన్న నేరాలను అఫిడవిట్ లో పేర్కొనలేదని ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ మదన్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.