Akhanda 2 Review : 'అఖండ 2' నిర్మాతలకు బిగ్ రిలీఫ్ - సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రద్దు
Akhanda 2 Tickets : 'అఖండ 2' మూవీ నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపుపై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజనల్ బెంచ్ రద్దు చేసింది.

Telangana High Court Big Relief To Balakrishna Akhanda 2 Ticket Rates Issue : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య 'అఖండ 2' నిర్మాతలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రీమియర్ టికెట్ ధరల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజినల్ బెంచ్ రద్దు చేసింది.
మా వాదనలు వినలేదు
తమ వాదనలు వినకుండానే సింగిల్ బెంచ్ ధరల పెంపు జీవోను సస్పెండ్ చేసిందంటూ చిత్ర నిర్మాణ సంస్థ '14 రీల్స్ ప్లస్' డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ అందరి వాదనలు వినాలని మళ్లీ అక్కడే విచారణ జరగాలని ఆదేశించింది. గురువారం ప్రీమియర్లతో పాటు టికెట్ ధరలను 3 రోజుల వరకూ పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై న్యాయవాది శ్రీనివాస రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు కాగా విచారించిన సింగిల్ బెంచ్... ప్రీమియర్ టికెట్ ధరల పెంపును రద్దు చేసింది.
అయితే, ప్రీమియర్లు వేయడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో '14 రీల్స్ సంస్థ' అప్పీల్‌కు వెళ్లి తమ వాదనలు వినిపించింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం సింగిల్ బెంచ్ ఉత్తర్వులను క్యాన్సిల్ చేసింది.
Also Read : లేడీ ఓరియెంటెడ్ మూవీలో భాగ్యశ్రీ - రాజేంద్ర ప్రసాద్ మూవీ ఫేమస్ సాంగ్ లిరిక్ టైటిల్‌గా...
'టికెట్ రేట్స్ ఇక పెంచం'
ప్రీమియర్లకు అనుమతి సహా టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇవ్వడం కాంట్రవర్సీగా మారిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఏ సినిమా టికెట్ ధరలను పెంచేది లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 'ఇకపై టికెట్ ధరలు పెంచం. సినిమా నిర్మాతలు, డైరెక్టర్స్ ఎవరూ మా వద్దకు రావొద్దు. హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇమ్మన్నారు. తక్కువ ధరలు ఉంటేనే ఫ్యామిలీ మొత్తం వచ్చి మూవీ చూస్తారు. అందుకే ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచం.' అని చెప్పారు.
టికెట్ ధరలు పెంచిన ప్రతీసారి వీటికి వ్యతిరేకంగా ఎవరో ఒకరు కోర్టు మెట్లెక్కుతున్నారు. చాలా వరకూ సినిమా రిలీజ్‌కు ముందే విచారణలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో టికెట్ ధరలను ఇక పెంచబోమంటూ సంచలన నిర్ణయం తీసుకుంది.






















