అన్వేషించండి

Telangana News: రైతు రుణమాఫీ సమస్యల పరిష్కార బాధ్యత అధికారులకు అప్పగింత- వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్

Telangana News: రైతు రుణమాఫీ అమల్లో సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే.. పంట రుణాలపై వడ్డీ రేట్లకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయనుంది.

Telangana Crop Loans: రుణమాఫీ... తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఆగస్టు 15లోగా 2లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి... ఆగస్టు  15లోగా మూడు విడతల్లో రుణమాఫీ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ... చాలా మంది రైతులకు రుణమాఫీ అందలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో... ప్రభుత్వం విమర్శలు ఎక్కుపెట్టింది ప్రతిపక్షం. రుణమాఫీని... తూతూ  మంత్రంగానే చేశారని విరుచుకుపడుతోంది. ఇది... ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. రుణమాఫీ చేసినా... విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్‌ సర్కార్‌కి.

ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.  రుణమాఫీ ఎవరెవరికి అందలేదు... ఎందుకు అందలేదో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి... రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలను గుర్తించారు. వీటిపై ప్రభుత్వానికి నివేదిక కూడా  ఇచ్చారు. ఆ నివేదికలో సమస్యలతో పాటు... వాటి పరిష్కారాలను కూడా సూచించారు. 

రుణమాఫీ అమలులో ప్రధాన సమస్యలు...
1. రైతుల బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌కు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ కాకపోవడం
2. ఆధార్‌కార్డులో పేరు, లోన్‌ అకౌంట్‌ పేరు వేరువేరుగా ఉండటం
3. రుణాలు తీసుకున్న రైతు కుటుంబంలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కావడం లేదా పెన్షన్లు తీసుకుంటున్న వారు ఉండటం
4. ఒక రైతుకు ఒకటి కంటే ఎక్కువ లోన్‌ అకౌంట్లు ఉన్నా రుణమాఫీ వర్తించదు
5. రుణమాఫీ కోసం ప్రభుత్వం పెట్టిన నిబంధనల పరిధిలో లేకపోవడం

అయితే... ఇవన్నీ సాంకేతిక సమస్యలు. రైతులకు భూమి, మట్టి, విత్తనాలు... వీటిపై తప్ప... టెక్నికల్‌ విషయాల గురించి పెద్దగా అవగాహన ఉండదు. దీంతో... ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సి ఉంది. అందుకే... ప్రభుత్వం..  రుణమాఫీ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రుణమాఫీ కాని రైతులను గుర్తించి... వారికి ఎందుకు పంట రుణం కాలేదు... దానికి గల కారణాలను ఆరా తీయాలని తెలిపింది. అర్హత ఉండి.. రుణమాఫీ అందని రైతుల జాబితా సిద్ధం చేయాలని  సూచించింది. అర్హులకు రుణమాఫీ అందాలని.. అందుకోసం ఎలా ముందకు వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

పంట రుణాల వడ్డీ రేట్లపై తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్‌...

రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రుణమాఫీ చేసి చేతులు దులుపుకోకుండా... కొత్తగా తీసుకోబోయే పంట రుణాలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. తక్కువ వడ్డీ రేటుకే పంట రుణాలు అందేలా కసరత్తు చేస్తోంది. మామూలుగా.... బ్యాంకులు, సహకార సొసైటీలు తక్కువ వడ్డీకే రైతులకు పంట రుణాలు ఇస్తుంటాయి. బ్యాంకుల్లో రుణాలు పొందలేని రైతులు... ప్రైవేట్‌ వ్యాపారులను  ఆశ్రయిస్తుంటారు. వారు భారీ వడ్డీకి రుణాలు ఇస్తుంటారు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేట్‌ వ్యాపారుల దోపిడీకి త్వరలోనే చెక్‌ పెట్టనుంది. ప్రైవేట్‌  వ్యాపారులు... రైతులకు ఇచ్చే పంట రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించబోతోంది. గతంలో ఇచ్చిన మనీలెండర్స్‌ యాక్ట్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది. ప్రైవేట్‌ వ్యాపారులు... 2 శాతానికి  మించి వడ్డీ వసూలు చేయకుండా... కొత్త రూల్స్‌ తీసుకురాబోతోంది. దీంతో చాలా మంది అన్నదాతలకు ఊరట లభిస్తుంది.

Also Read: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షావరణం- హైదరాబాద్‌సహా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget