అన్వేషించండి

Family Survey In Telangana: తెలంగాణలో ఫ్యామిలీ సర్వేలో అడిగే సమాచారం ఇదే- ఏ పార్టీలో సభ్యత్వం ఉందో చెప్పాలట!

Telangana News:రిజర్వేషన్ల అమలుతోపాటు డిజిటల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేయనుంది. నవంబర్ 4 నుంచి సర్వే ప్రారంభంకానుంది.

Telangana Family Survey : తెలంగాణలో వచ్చే నెల నుంచి కుటుంబ సమగ్ర సర్వే చేపట్టనుంది ప్రభుత్వం. నెలరోజుపాటు జరిగే సర్వేకు సంబంధించిన ఫామ్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఉన్న వివరాలు పరిశీలించి ఆ వివరాలు రెడీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నవంబర్ నాలుగు నుంచి సర్వే ప్రారంభించి డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయలని ప్రభుత్వం భావిస్తోంది. 

నవంబర్‌ 4 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అధికారులు ఇంటింటికీ వెళ్తారు. ఫ్యామిలీ వివరాలు తెలుసుకుంటారు. కులాల గురించి కూడా తెలుసుకుంటారు. దీన్ని సమగ్ర, సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేగా పేర్కొంటున్నారు. దాదాపు 90 వేల మంది సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటారు. ప్రతి ఇంటికీ వెళ్లి వాళఅల వివరాలు నమోదు చేస్తారు. ఇలా క్షేత్రస్థాయి సర్వేను 15 రోజుల్లో పూర్తి చేసి మరో 15 రోజుల్లో ఆ డేటాని కంప్యూటరీకరిస్తారు. దీంతో సర్వై పూర్తి అవ్వడమే కాకుండా ఏ సామాజిక వర్గం వాళ్లు ఎంతమంది ఉన్నారనే విషాయాలపై కూడా క్లారిటీ వస్తుంది. 

Family Survey In Telangana: తెలంగాణలో ఫ్యామిలీ సర్వేలో అడిగే సమాచారం ఇదే- ఏ పార్టీలో సభ్యత్వం ఉందో చెప్పాలట!

ఈ సర్వే ఫామ్‌ మూడు విభాగాలుగా ఉంటుంది. మొదట ఎక్కడ సర్వే చేస్తున్నారో ఆ వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో జిల్లా కోడ్, మండలం కోడ్‌, ఇంటి నెంబర్‌ నమోదు చేసుకుంటారు. అందులోనే జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ లేదా మున్సిపాలిటీ పేరు, హాబిటేషన్ పేరు, వార్డ్ నెంబర్, ఇంటి నెంబర్ వీధి పేరు దానికి కేటాయించిన కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడే కుటుంబానికి ఓసీరియల్ నెంబర్ కూడా ఇస్తారు. 

ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత పార్ట్ 1లో వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో కుటుంబంలోని వారి వివరాలు, కుటుంబ యజమానికి ఉన్న సంబంధం, వారు కేటగిరి ఏంటో చెప్పాలి. మతం, సామాజిక వర్గం, కులం, కులానికి వేరే పేరు ఉంటే అది చెప్పాలి. వయసు, మాతృభాష చెప్పాలి. వీటితోపాటు ఆధార్‌ కార్డు వివరాలు ఇష్టం ఉంటే ఇవ్వాలి లేకుంటే ఇవ్వకపోయిన ఏం కాదు. ఇందులోనే మొబైల్ నెంబర్‌, పెళ్లి అయిందో లేదో చెప్పాలి. దివ్యాంగులైతే అవికూడా తెలియజేయాలి. విద్యకు సంబంధించిన వివరాలు అంటే ఎక్కడ చదువుకున్నారు... ఏం చదువుకున్నారు. ఎప్పుడ స్కూల్ మానేశారు, కారణం ఏంటో చెప్పాలి. 

తర్వాత పేజ్‌లో ఉపాధి, ఉద్యోగం వివరాలు చెప్పాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఆ వివరాలు అందజేయాలి. టర్నోవర్‌ గురించి తెలపాలి. ఆదాయం ఎంత వస్తుంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారో లేదో చెప్పాలి. బ్యాంకు అకౌంట్ ఉందా లేదో వివరించాలి. తర్వాత పేజ్‌లో మీకు ఉన్న భూముల వివరాలు ఇవ్వాలి. 

భూమికి సంబంధించి ఈ వివరాలు అందజేయాలి:-

  • మీరు భూమి కలిగి ఉన్నారా
  • ధరణి పాస్ బుక్ ఉంటే నెంబర్ రాయండి 
  • భూమి ఏ రూపంలో ఉందో చెప్పాలి అంటే... పట్టా స్థలమా, అసైన్డ్‌ స్థలమా, అటవీ హక్కు భూమో చెప్పాలి. 
  • భూమి ఏ రకమో వివరించాలి(తరి, మెట్ట, పడవు)
  • భూమికి నీటి పారుదర సౌకర్యం ఎలా కల్పిస్తున్నారో తెలియజేయాలి
  • కౌలు భూమి సాగు చేస్తున్నట్టైతే ఎంత విస్తీర్ణమో చెప్పాలి. 

రిజర్వేషన్ కేటగిరిలోకి మీరు వస్తే ఈ వివరాలు సమర్పించాలి:- 

  • రిజర్వేషన్ విధానం నుంచి పొందిన విద్యా ప్రయోజనాలు ఏంటీ
  • రిజర్వేషన్ విధానం నుంచి పొందిన ఉద్యోగ ప్రయోజనాలు ఏంటీ
  • గత ఐదేళ్లుగా మీరు లబ్ధి పొందిన మూడు ప్రభుత్వ పథకాల పేర్లు 
  • రిజర్వేషన్ కేటగిరికి చెందిన వారు అయితే సర్టిఫికేట్ తీసుకున్నారా అవునో కాదో చెప్పాలి 
  • మీరు డీనోటిఫై చేసిన సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందినవారా

వీటితోపాటు రాజకీయ వివరాలు కూడా తీసుకుంటున్నారు. ఏ పార్టీలో సభ్యత్వం ఉంది...ఏ పదవుల్లో ఉన్నారు ఉండేవాళ్లు, ఎప్పటి నుంచి పని చేస్తున్నారో చెప్పాలి. వలస వచ్చిన వాళ్లు అయితే ఎక్కడి నుంచి వలస వచ్చారో కూడా తెలియజేయాలి. 

Family Survey In Telangana: తెలంగాణలో ఫ్యామిలీ సర్వేలో అడిగే సమాచారం ఇదే- ఏ పార్టీలో సభ్యత్వం ఉందో చెప్పాలట!

ఇక పార్టు-IIలో మరింత నిశితంగా సమాచారం అడుగుతున్నారు. 

  • ఐదేళ్లలో మీరు ఏమైనా రుణాలు తీసుకున్నారా 
  • ఏ అవసరం కోసం రుణం తీసుకున్నారు
  • ఎక్కడ నుంచి రుణం తీసుకున్నారు
  • ఏదైనా వ్యవసాయం అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నారా 
  • కుటుంబానికి చెందిన పసు సంపద ఏంటీ  అవులు ఎన్ని గేదెలు ఎన్ని, కోళ్లు,మేకలు, పందులు, బాతుల వివరాలు చెప్పాలి
  • స్థిరాస్థి వివరాలు కూడా ఇవ్వాలి
  • చరాస్తి వివరాలు కూడా చెప్పాలి 
  • రేషన్ కార్డు ఉంటే నెంబర్ చెప్పాలి 
  • నివాసం ఉంటున్న ప్రాంతం ఏ ఏరియాలో ఉంది
  • ఉంటున్న ఇల్లు విస్తీర్ణం ఎంత 
  • నివాసం ఉంటున్న గృహం అద్దె ఇల్లా సొంత ఇల్లా యజమాని ఎవరో చెప్పాలి 
  • ఇంటిలో ఉన్న నివాస గదుల సంఖ్యతెలియజేయాలి 
  • తాగునీరు ఉందా 
  • మరుగుదొడ్డి సౌకర్యం ఉందా 
  • విద్యుత్ సౌకర్యం ఉందా
  • దేనిపై వెంట చేస్తున్నారు

ఈ వివరాలు సేకరించిన తర్వాత కుటుంబ యజమాని సంతకం చేసి మొబైల్ నెంబర్ రాయాలి. దాన్ని చూసి ఎన్యుమరేటర్ సైన్ చేయాలి. తర్వాత సూపర్‌వైజర్ సర్వే చేయాలి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget