అన్వేషించండి

Telangana: కుల గణనకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం- ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే అవకాశం!

Revanth Reddy: తెలంగాణలో కులగణన చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు మరికొన్ని రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయనుంది.

Caste Census In Telangana: దేశవ్యాప్తంగా కులగణన చేపయాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పటి వరకు ఆ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతోందనే చర్చ అయితే నడుస్తోంది. ఇలాంటి టైంలో పీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నింటిపై చాలా మందిలో ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చారు. 

హైదరాబాద్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్​కు అనుగుణంగా సమగ్ర కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కులగణనకు సంబంధించిన ప్రకటన వస్తుందని అన్నారు.

త్వరలో విధి విధానాలు

తెలంగాణలో బీసీలకు అండగా ఉండటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు మహేష్‌గౌడ్. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే కొన్ని అమలు చేసింది. కీలకమైన కులగణనకు సంబంధించిన గైడ్‌లైన్ మూడు నాలుగు రోజుల్లో రానున్నాయని తెలిపారు. అవి పూర్తి అయిన తర్వాత బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల అంశాన్ని తేలుస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని కూడా చెప్పేశారు. 

త్వరలోనే బీసీ సంఘాలను సీఎం వద్దకు తీసుకెళ్తానని మహేష్‌ మాట ఇచ్చారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కావాల్సిన డిమాండ్లు, అన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్దామన్నారు. అంతే కాకుండా కుల గణన పూర్తైన తర్వాత నిజాం గ్రౌండ్స్‌లో సభ పెట్టి సీఎం రేవంత్‌ను సన్మానిద్దామని పిలుపునిచ్చారు. 

మూడో రాష్ట్రం తెలంగాణ

పార్టీ పదవుల్లో, ప్రభుత్వం పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. కర్ణాటకలో, బిహార్‌లో అధికారంలో ఉన్నప్పుడు కుల గణన చేసి చూపించామన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చేసి చూపిస్తామని చెప్పుకొచ్చారు. 

బీసీ ఓటు బ్యాంకు కాపాడుకునేలా ప్లాన్

బీసీ రిజర్వేషన్‌లు, ఇతర సమస్యలపై ఓవైపు నుంచి కృష్ణయ్య పోరాటానికి సిద్ధమవుతున్నారు. అదే టైంలో బీఆర్‌ఎస్‌ కూడా ఒత్తిడి తీసుకొస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీసీ సమస్యలు పరిష్కరించి కృష్ణయ్య లాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీసీలు తమవైపే ఉండేలా ప్లాన్ చేస్తోంది. అందుకే ఆయన వద్దకు రాయబారం కూడా పంపించారు. రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన కృష్ణయ్యతో మల్లు రవి సమావేశమయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. 

ఇటు బీఆర్‌ఎస్‌కి కూడా అవకాశం ఇవ్వండా ఉండేలా ప్లాన్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపు కుల గణన పూర్తి చేసి సంపూర్ణ ఆధిపత్యం సాధించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే వచ్చే వారంలో కులగణనకు సంబంధించిన కీలక ప్రకటన చేయనుంది. 

Also Read: చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోనే కూల్చివేతలు - హైడ్రాను వ్యతిరేకిస్తే ఎవరికి నష్టం ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Embed widget