అన్వేషించండి

Telangana Govt: తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్ ఆలోచన, ఆ వ్యవస్థ కూడా రద్దే!

Telangana Govt: కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆర్డీవో వ్యవస్థను రద్దు చేయనున్నట్లు సమాచాం.

Telangana Govt: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో ఆర్డీవో(రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్) వ్యవస్థను రద్దు చేయబోతున్నట్లు సమాచారం. రెవెన్యూ వ్యవస్థలో రెవెన్యూ డివిజన్ అధికారి పోస్టు కీలకమైంది. అయితే వీఆర్వో, వీఆర్ఏలను రద్దు చేసిన తర్వాత, పలు సంస్కరణల్లో భాగంగా ఆర్డీవో అధికారాలను కుదించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్డీవోల ప్రాధాన్యతను ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. అయినప్పటికీ రెవెన్యూలో కీలకమైన ఈ ఆర్డీవో పోస్టును పూర్తి గా రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ సర్కారు.. తాజాగా రెవెన్యూ డివిజన్ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇటీవల కొంత మంది ఆర్డీవో లకు పదోన్నతులు కూడా ఇచ్చారు. దాదాపు 90 మంది వరకు ఆర్డీవోలో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్నారు. ఆర్డీవో వ్యవస్థను రద్దు చేసి వీరందరికి కొత్త పోస్టులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం  ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆర్డీవోలకు పర్యవేక్షణ బాధ్యతలు

త్వరలోనే ఆర్డీవో వ్యవస్థను పూర్తి స్థాయిలో రద్దు చేసి.. రెవెన్యూ డివిజన్ అధికారులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్ లతో పాటు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆర్డీవోల సేవలను వాడుకోవాలని యోచిస్తోంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాటికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో 300 పడకలు ఉన్నాయి. అయితే, ఈ ఆస్పత్రులకు వచ్చే వారికి వైద్య సేవలు ఎక్కడ అందుతున్నాయి? వైద్య సేవలు అందని పక్షంలో ఎవరిని సంప్రదించాలో తెలియక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అడ్మినిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికి ఆర్డీవోలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ శాసన మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టత కూడా ఇచ్చారు. శుక్రవారం మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎస్ ప్రభాకర్, మంకెన కోటిరెడ్డి అడిగిన ప్రశ్నలకు హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ వ్యవస్థ ఉందని వారిపై పర్యవేక్షణ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించనున్నట్లు చెప్పారు. 

Also Read: Apple India Revenue: భారత్‌లో జూన్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాల రికార్డు, రెండంకెల వృద్ధి నమోదు

తిరిగొచ్చిన తహసీల్దార్లు, గిర్దావార్లు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 74 రెవెన్యూ డివిజన్లలోని ఆర్డీవోలకు సర్కారు త్వరలో ఏరియా ఆస్పత్రుల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మంత్రి ప్రకటనతో ఆర్డీవోలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారా లేగా ఆర్డీవోల వ్యవస్థనే రద్దు చేయనున్నారా అనే చర్చ జరుగుతోంది. అలాగే శుక్రవారం రాష్ట్ర సర్కారు వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని వేరే శాఖల్లో సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్నట్లు ఎంఆర్వోలను తహసీల్దార్లుగా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లను గిర్దావార్ లుగా పేర్లను మార్చింది.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget