Prasanth Kishore: తెలంగాణ కాంగ్రెస్‌లో పీకే ప్రకంపనలు- సంచలనంగా మారిన ఠాగూర్‌ ట్వీట్‌

ప్రశాంత్ కిశోర్‌తో లాభమా నష్టమా అనే చర్చ కంటే.. ఆయనతో తలనొప్పే ఎక్కువగా ఉందని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేసే పీకే కాంగ్రెస్‌కు ఎలా ప్లస్‌ అవుతాడని ప్రశ్నిస్తున్నారు.

FOLLOW US: 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌  తెలంగాణ కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ బలోపేతానికి సలహాలు ఇచ్చేందుకు పార్టీలో చేరేందుకు పీకే ఇప్పటికే అంగీకరించారు. దీనిపై కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోనుంది. 

ప్రశాంత్‌ ఎపిసోడ్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రగిలిపోతున్నారు. ఓవైపు టీఆర్‌ఎస్‌ పార్టీకి సలహాలు ఇస్తామంటున్న ప్రశాంత్ కిషోర్‌ చెప్పడంతో కాకపుట్టిస్తున్నాయి. 

ప్రశాంత్‌ కిషోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశంపై ఏఐసీసీలో తీవ్ర మథనం జరుగుతోంది. దీనిపై అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకోనున్నారు. ఇటు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే... మరోవైపు ఇతర పార్టీలకు సలహాలు ఇచ్చేందుకు కూడా ఒప్పందాలు చేసుకోవడంపై శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌ కోసం పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్... కాంగ్రెస్‌ను బలహీన పరిచే వ్యూహాలు రచిస్తున్నారని మండిపడుతున్నారు ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు. దీనిపై ఎలా మాట్లాడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి నేతలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నారు. రాహుల్ గాంధీతో పర్యటనలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రశాంత్‌ కిషోర్ పనిచేయడమే కాకుండా ఆయన కాంగ్రెస్‌ చేరితే తమను ఇరకాటంలో పడేసినట్టు అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా మాట్లాడకపోయినా  లోలోప మధన పడుతున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌ మాత్రం పరోక్షంగా పీకే తీరును తప్పుపడుతూ ట్వీట్‌లు చేయడం సంచలనంగా మారింది. నీ శత్రువుతో స్నేహంగా ఉండే వ్యక్తులను నమొద్దనే కొటేషన్‌ను మాణిక్కం ఠాగూర్‌ ట్వీట్ చేశారు. దీంతోపాటు మహాత్మ గాంధీజీ కొటేషన్‌ కూడా జోడించారు. చిట్టచివరి అవకాశాన్ని, ఆశను వదులుకోనంటూ ట్వీట్ చేయడం కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారి తీసింది. 

ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్‌పై ఎవరూ బహిరంగా వ్యాఖ్యలు చేయొద్దని అధిష్ఠానం సూచించినట్టు తెలుస్తోంది. సమస్యలు ఉంటే తామే పరిష్కరిస్తామని అంటున్నారు. ఇవాళ జరిగే ఏఐసీసీ సమావేశంలో ప్రశాంత్‌ కిషోర్‌ చేరికపై తేల్చేయనున్నారు. 

Published at : 25 Apr 2022 01:04 PM (IST) Tags: CONGRESS sonia gandhi Prasanth Kishore telangana congress leaders

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్

Breaking News Live Updates: ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

టాప్ స్టోరీస్

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?