అన్వేషించండి

Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!

Telangana News: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీఎంఆర్‌ఎప్‌ నిధుల గోల్‌మాల్‌పై కూడా స్పందించింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చర్చ జరిగింది.
  • గత ప్రభుత్వ 600 కోట్ల బకాయిలు, ప్రస్తుత ప్రభుత్వం 2408 కోట్లు చెల్లించింది.
  • ఆరోగ్యశ్రీ సేవలు ఆగకుండా, నెట్‌వర్క్ ఆసుపత్రులు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • గత ప్రభుత్వంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతోంది.

Telangana News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు, నిధుల విడుదలై అధికార , ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రత్యేకించి ఆరోగ్య శ్రీ బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరలో అమలు కావడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన ఆర్థిక భారాన్ని, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యలను సుదీర్ఘంగా వివరించారు. నిరుపేదల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ పథకం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పునరుద్ఘాటించారు. 

ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించిన గత ప్రభుత్వం సుమారు 600 కోట్ల బకాయిలు పేరుకుపోయేలా చేసిందని రేవంత్ విమర్శించారు. ప్రభుత్వ ఎయిడెడ్ ఆసుపత్రులకు 240 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు 360 కోట్లు బకాయిలు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా సగటున 89 కోట్లు ఖర్చు చేస్తూ, మొత్తం 2,408కోట్ల బకాయిలను విజయవంతంగా క్లియర్ చేసిందన్నారు. 

ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడా ఆగకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. నిధుల విడుదల ప్రక్రియను మరింత సరళతరం చేస్తామని హామీ ఇచ్చారు. 

సీంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై కామెంట్స్ 

ఆరోగ్య శ్రీపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి అక్రమాల అంశం కూడా తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని రేవంత్ ఆరోపించారు. ప్రత్యేకించి కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యక్తిగత సహాయకులు ఈ నిధులను పక్కదారి పట్టించారని, నిరుపేదలకు అందాల్సిన సొమ్మును అక్రమంగా కాజేశారని ఆయన ఆరోపించారు. 

ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వ సమగ్ర విచారణకు ఆదేశించిందని, ప్రస్తుతం దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరి పీఏలు, CMRF సొమ్మును కాజేశారో తెలుసని, త్వరలోనే అన్ని విషయాలు ఆధారాలతో సహా యటకు వస్తాయని రేవంత్ హెచ్చరించారు. 

సేవల విస్తరణ నెట్‌వర్క్ ఆసుపత్రుల పెంపు 

ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతను వివరిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 9 లక్షల 45వేల మందికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందాయని తెలిపారు. గతంలో ఏడాదికి సగటున 2.5 లక్షల మందికి మాత్రమే సేవలు అందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 4 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో నెలకు సగటున 52 కోట్లు మాత్రమే చెల్లిస్తే, ప్రస్తుతం తాము నెలకు 89కోట్లు రెగ్యులర్‌గా చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో కేవలం 330గా ఉన్న ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యను ప్రస్తుతం 537కు పెంచినట్టు ప్రభుత్వం వెల్లడించింది.             

Frequently Asked Questions

ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఆచరణలో ఉందా?

గ్రీన్ ఛానల్ ద్వారా ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, అది ఆచరణలో లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు.

గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి ఎంత బకాయిలు పేరుకుపోయేలా చేసింది?

గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి సుమారు 600 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయేలా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలను ఎలా క్లియర్ చేసింది?

కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రతి నెలా సగటున 89 కోట్లు ఖర్చు చేస్తూ, మొత్తం 2,408 కోట్ల బకాయిలను విజయవంతంగా క్లియర్ చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది?

సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విచారణలో కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్య ఎంత పెరిగింది?

గతంలో 330గా ఉన్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యను ప్రస్తుతం 537కు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget