Life Lesson Tips: స్కిల్స్ పెంచుకోకపోతే కెరీర్ క్లోజ్.. జీవితాంతం ఈ విషయాలు గుర్తుంచుకోండి: స్కిల్ యూనివర్సిటీ వీసీ
నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని, లేకపోతే జీవితం తలకిందులైపోతుందని సచిన్, వినోద్ కాంబ్లీ జీవితాలను ఉదాహరణగా చెప్పారు.

హైదరాబాద్: జీవితాంతం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలని, స్కిల్స్ నిరంతరం పెంచుకోవడంతో అత్యున్నత దశకు చేరుకుంటారని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు సూచించారు. అందుకు ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. 23 ఏళ్లకు సచిన్ టెండూల్కర్ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్ గా మారాడు, అదే వయసులో సచిన్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ కెరీర్ ముగిసింది. బౌలర్ల బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేక కాంబ్లీ ఇబ్బండి పడ్డాడు. స్కిల్ సెట్ పెంచుకోని కారణంగా కాన్ఫిడెన్స్ కోల్పోయి భారత జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం కాంబ్లీ కెరీర్ సైతం క్లోజ్ అయింది. కానీ సచిన్ నిత్యం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ, బ్యాటింగ్ లోపాలను సవరించుకుని బెస్ట్ క్రికెటర్‌గా అవతరించాడు. కనుక జీవితంలో తప్పులను సరిదిద్దుకోవడంతో పాటు, స్కిల్స్ పెంచుకోవడం, కొత్త విషయాలను నేర్చుకుంటే భవిష్యత్ ఉంటుందన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ’రైట్ టు ఎడ్యుకేషన్ తరువాత స్కూల్ విద్యార్థుల సంఖ్య పెరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కంటే స్కూల్ స్టూడెంట్స్ మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్, ఉచిత హాస్టల్ సదుపాయం లాంటి వాటి కారణంగా స్కూల్ స్టడీపై ఫోకస్ పెరిగింది. కానీ టెక్నికల్ కాలేజీలో చేరిన విద్యార్థులు సబ్జెక్ట్ కోసం అమీర్‌పేటకు వస్తు్న్నారు. ఇంజనీరింగ్, ఎంసీఏ కాలేజీలలో వారికి ఏం స్కిల్స్ నేర్పిస్తున్నారనేది అందరికీ అర్థమవుతోంది. మంచి ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేసిన తరువాత స్కిల్ సెట్ కు ఏమాత్రం తగని, సరిపోని ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. కనుక మంచి మార్గాన్ని, కోర్సును ఎంచుకుని హార్డ్ వర్క్ చేయాలి.
టీచింగ్ అప్రెంటిస్‌షిప్ చేయండి
టాలెంట్ మెరుగు పరుచుకునేందుకు టీచింగ్ అప్రెంటిస్ షిప్ చేయండి. తద్వారా మీరు వేరే వారికి మీరు నేర్చుకున్నది టీచింగ్ చేయడం ద్వారా మరింత బెస్ట్‌గా మారతారు. విద్యార్థులను బేసిక్, బేసిక్ ప్లస్ అని కెటగిరీలుగా విభజించవచ్చు.
స్కిల్ యూనివర్సిటీలో వచ్చే ఏడాది ఇంజినీరింగ్ కోర్సు ప్రారంభించాలని చూస్తున్నాం. ఎన్నో పెద్ద కంపెనీలు ల్యాబరేటరీలు ఏర్పాటు చేయడానికి వస్తున్నాయి. వన్ కాలేజ్ వన్ క్లాస్ రూమ్ అనే ప్రోగ్రామ్ చేస్తాం. తద్వారా ఆ కాలేజీలో ఏం నేర్పిస్తున్నారని, ఏం కొత్తదనం ఉందని విద్యార్థులకు క్లియర్‌గా తెలుస్తుంది. గోద్రెజ్ లాంటి కంపెనీలు పాలిటెక్నిక్ విద్యార్థులను తీసుకుని రూజ30, 35 వేల జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. లేకపోతే ఆ పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ సెకండియర్ లో జాయిన్ అయ్యి కోర్సు పూర్తిచేశాక కేవలం రూ. 10, 15 వేలకు జాబ్‌లో జాయిన్ అవుతున్నారు. అందుకే పాలిటెక్నిక్ లోనే ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా వారికి మంచి కెరీర్ లభిస్తుంది.
విద్యార్థులకు, విజయం సాధించాలనుకునే వారికి టిప్స్
1. నెవర్ స్టాప్ లెర్నింగ్.. మీకు ఇప్పుడు ఉన్న కాన్సెప్టుతో ఆగిపోకూడదు.
2. పాజిటివ్ యాటిట్యుడ్. ఓ విషయంపై అవగాహన ఉంటే అంతవరకే మాట్లాడాలి. అనవసర విషయాలకు
3. సెల్ఫ్ రెస్పెక్ట్.. స్వామీజీ, గురూలజీను సందర్శించిన తరువాత కొన్నేళ్లకు మీలోనే దేవుడున్నాడు. ఇతరులకు గౌరవం ఇవ్వడంతో మీకు తిరిగి గౌరవం దక్కుతుంది. ఎవరినీ కించపరచకుండా మీ పని మీరు చూసుకుంటే సక్సెస్ మీ వెంటే వస్తుంది.






















