Hyderabad: 5 రోజుల క్రితం హైదరాబాద్‌లో బాలుడు మాయం! కట్‌చేస్తే ఢిల్లీలో ప్రత్యక్షం, ఏం జరిగిందంటే

ఆరేళ్ల బాలుడు ఉన్నట్టుండి 5 రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు అన్ని చోట్లా వెతుకుతుండగా ఉన్నట్టుండి ఢిల్లీలో కనిపించాడు.

FOLLOW US: 

హైదరాబాద్‌లో సరిగ్గా 5 రోజుల క్రితం కనిపించకుండా పోయిన 5 ఏళ్ల బాలుడు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. బాలుడ్ని హైదరాబాద్ పోలీసులు క్షేమంగా ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ ఈ వ్యవహారం ఎలా జరిగిందన్నది మాత్రం తేలడం లేదు. నగరంలోని మల్లేపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇవీ.. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆరేళ్ల బాలుడు ఉన్నట్టుండి 5 రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు అన్ని చోట్లా వెతుకుతుండగా ఉన్నట్టుండి ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యాడు. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లోని హబీబ్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన ఫ్లైట్‌లో ఢిల్లీకి వెళ్లి బాలుణ్ని క్షేమంగా ఇక్కడికి తీసుకొని వచ్చారు. స్టేషన్‌లోనే సాయంత్రం తల్లిదండ్రులకు బాలుడ్ని క్షేమంగా అప్పగించారు. 

మల్లేపల్లిలోని బడీమసీదు ప్రాంతంలో ఉంటున్న కారు డ్రైవర్‌ హనీఫ్‌ కుమారుడు ఆయాన్‌ ఈనెల 17న కనిపించకుండా పోయాడు. పోలీసులు నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిల్లో గాలిస్తున్నారు. అదే సమయంలో బాలుడి వివరాలు ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా వాటిని చూసిన ఢిల్లీ నిజాముద్దీన్‌ పోలీసులు ఆదివారం నగర పోలీసులను సంప్రదించారు. 

ఈ క్రమంలో బాలుడు ఆయాన్‌ను తీసుకు వచ్చేందుకు అడిషనల్ ఇన్‌స్పెక్టర్‌ నరసింహ, బాలుడి తండ్రి హనీఫ్‌లు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. నిజాముద్దీన్‌ పోలీస్ స్టేషన్‌లో ఉన్న బాలుణ్ని తీసుకుని హైదరాబాద్‌కు సోమవారం వచ్చారు. ఈ నెల 19న ఒక అపరిచిత వ్యక్తి నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన ఆధార్‌ వివరాలు నమోదు చేసి ఆయాన్‌ను అప్పగించి వెళ్లాడంటూ నిజాముద్దీన్‌ పోలీసులు చెప్పారు. అయితే, మల్లేపల్లిలో ఉన్న బాలుణ్ని ఆ వ్యక్తే చేరదీసి రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి రైల్లో ఎందుకు తీసుకెళ్లాడు? ఎందుకు ఢిల్లీ పోలీసులకు అప్పజెప్పాడనేది మాత్రం అంతుచిక్కడం లేదు. కిడ్నాప్‌ చేసుంటే ఆధార్‌ కార్డు, వివరాలు పోలీసులకు ఎందుకు ఇచ్చాడని ఆరా తీస్తున్నారు. అయితే, కిడ్నాప్ చేసిన వ్యక్తి ఢిల్లీలో వదిలేయగా.. మరో వ్యక్తి చేరదీసి పోలీస్ స్టేషన్‌లో అప్పగించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

Also Read: Mir Osman Ali Khan: హైదరాబాద్ చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎలా చనిపోయారో తెలుసా.. ? భారంగా గడిచిన నిజాం 7 చివరి క్షణాలు

Also Read: Bheemla Naiak: నేడే బీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్, ఈ రూట్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - వీళ్లు మరో మార్గం చూసుకోవాల్సిందే!

Published at : 23 Feb 2022 09:44 AM (IST) Tags: hyderabad kidnap Boy in Delhi Boy kidnap mallepalli kidnap Habibnagar boy kidnap Nizamuddin police station

సంబంధిత కథనాలు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్

Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !

Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !

టాప్ స్టోరీస్

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు,  నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

Indigo OverAction : ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా - మళ్లీ అలా చేస్తే ?

Indigo OverAction  :   ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా -  మళ్లీ అలా చేస్తే ?