అన్వేషించండి

KCR News: దాదాపు 5 గంటలపాటు కేసీఆర్ ను విచారించిన సిట్, స్టేట్మెంట్ రికార్డ్

Telangana ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 5 గంటలపాటు సిట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది.

హైదరాబాద్‌: బంజారా హిల్స్‌లోని నందినగర్ నివాసంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) సిట్ విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) అధికారులు సుమారు 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై అధికారులు ఆయనను ప్రశ్నించి, స్టేట్మెంట్ తీసుకున్నారు. 

మాజీ ఎస్ఐబీ అధికారులను రిటైర్మెంట్ అయినా సర్వీసు ఎందుకు కొనసాగించారు. వారి పదవీ విరమణ తరువాత కూడా టచ్‌లో ఉన్నారా, వారితో ఏ విషయాలు చర్చించారు.. ఫోన్ ట్యాపింగ్ వివరాలు ఎవరి నుంచి మీకు అందేవి అని.. విచారణలో భాగంగా సిట్ అధికారులు కేసీఆర్‌ను పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

సిట్ అధికారులు తొలుత హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి నోటీసులు పంపగా, కేసీఆర్ దానికి బదులిస్తూ తన ప్రస్తుత నివాసం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి అని స్పష్టం చేశారు. ‘నేను గత కొన్నేళ్లుగా ఎర్రవల్లిలోనే ఉంటున్నాను. నందినగర్ కేవలం అడ్రస్ కోసం మాత్రమే. చట్ట ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిని వారు ఎక్కడ నివసిస్తుంటే అక్కడే విచారించాలి’ అని కేసీఆర్ పోలీసులకు రాసిన 6 పేజీల లేఖలో పేర్కొన్నారు. అయితే, ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం నందినగర్ నివాసమే రికార్డుల్లో ఉందని, విచారణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలు తరలించడం కష్టమని చెబుతూ సిట్ అధికారులు ఎర్రవల్లికి రావడానికి నిరాకరించారు.

డబుల్ స్టాండర్డ్స్ అని ఆరోపణ
హరీష్ రావు వంటి నేతలకు వారి సొంత ఊరు సిద్దిపేటలో కాకుండా హైదరాబాద్‌లో నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, తన విషయంలో సిట్ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. చట్ట ప్రకారం తాను ఈ నోటీసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అయినా బాధ్యతాయుతమైన పౌరుడిగా విచారణకు సహకరిస్తానని ప్రకటించారు. ఆ మేరకు కేసీఆర్ ఆదివారం ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి 11 గంటల సమయానికి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటకు ప్రారంభమైన సిట్ విచారణ దదాపు 5 గంటలపాటు కొనసాగింది. ఆరుగురు అధికారులు కేసీఆర్‌ను పలు ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. 

మరోవైపు, కేసీఆర్ విచారణను నిరసిస్తూ తెలంగాణ భవన్ గేటు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు లోపలికి వెళ్లకుండా పోలీసులు గేటుకు అడ్డంగా నిలబడి గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget