అన్వేషించండి

Medaram News: ఆదివాసి బిడ్డను.. పారిపోయే రకాన్ని కాదు- మేడారం జాతర దుష్ప్రచారంపై మంత్రి సీతక్క

TG Minister Seethakka | మేడారం జాతర విజయవంతమైందని, తాను ఆదివాసి బిడ్డను అని, పారిపోయే రకాన్ని కాదన్నారు మంత్రి సీతక్క. ప్రజల కోసం, భక్తుల కోసం పంతం నెగించుకునే రకాన్ని అన్నారు.

Medaram Jatara 2026 | ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తశుద్ధితో ఆదివాసీల అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పరితపించే ఆదివాసి బిడ్డను తాను అని పేర్కొన్నారు. తాను పారిపోయే రకం కాదని, భక్తులు, ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకమని స్పష్టం చేశారు. ఆదివాసి అస్తిత్వం, తల్లుల పట్ల అచంచల భక్తి తన జీవన విధానమని, మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు భయపడబోనని మంత్రి తెలిపారు.

కష్టపడి పనిచేసిన సిబ్బందిని అభినందించిన సీతక్క

మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించినట్లే, జాతర అనంతరం చేపట్టాల్సిన పనులన్నీ సమర్థంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. 5 వేలకు పైగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి మేడారం పరిసరాలను పూర్తిగా పరిశుభ్రం చేస్తున్నామని, రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.


Medaram News: ఆదివాసి బిడ్డను.. పారిపోయే రకాన్ని కాదు- మేడారం జాతర దుష్ప్రచారంపై మంత్రి సీతక్క

కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ సమస్య నిజమే..

వీఐపీల అధిక రాకపోకల కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిన మాట వాస్తవమేనని, ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు (TGSRTC) కూడా చిక్కుకుపోయాయని సీతక్క వివరించారు. అయితే ఘట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం, ఘట్టమ్మ దర్శనం అనంతరం సమ్మక్కకు వచ్చే సంప్రదాయం దృష్టిలో ఉంచుకుని అక్కడ సజావుగా రాకపోకలు కొనసాగించగలిగామని చెప్పారు. ఈసారి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించగలిగామని మంత్రి సీతక్క తెలిపారు.

భక్తితో పాటు బాధ్యత, సంయమనం పాటిస్తూ దర్శనాలకు రావాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి ఫలించిందని, అందుకే సమ్మక్క సారక్క జాతర బ్రహ్మాండంగా సాగిందని మంత్రి పేర్కొన్నారు. సమ్మక్క–సారలమ్మలతో తమకు భావోద్వేగ బంధం ఉందని, అందుకే ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించామని చెప్పారు.

పనులు పూర్తి చేయడం వల్లే రద్దీ పెరిగింది..

గుడి నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం భుజాన వేసుకుందని, జాతరకు ముందే శాశ్వత నిర్మాణ పనులు పూర్తి కావడం వల్లే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని తెలిపారు. గతంలో జాతరకు ముందు రోజుకు ఒకటి–రెండు లక్షల మంది మాత్రమే వచ్చేవారని, కొత్త గుడి నిర్మాణం అనంతరం ఒక్క రోజులోనే ఎనిమిది లక్షల మంది వరకు భక్తులు తరలివచ్చారని చెప్పారు. తాత్కాలిక ఏర్పాట్లకు బదులు శాశ్వత ఏర్పాట్లు చేయడం వల్లే ఈ రద్దీ సాధ్యమైందని వివరించారు. త్రాగునీరు, టాయిలెట్లు ముందస్తుగానే సిద్ధం చేశామని తెలిపారు.

సమ్మక్కను సకాలంలో గద్దెలపైకి తీసుకురావడంలో పూజారులు సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది కొత్త పోలీస్ సిబ్బంది పూజారులను గుర్తించలేక పొరపాటు జరిగిందని, అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. మేడారంలోనే ఒకరోజు ఉండి క్యాబినెట్‌ నిర్ణయాలు తీసుకోవడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శుక్రవారం వీఐపీ తాకిడి ఎక్కువగా ఉండటంతో కొందరు వీఐపీలు 30 నుంచి 40 వాహనాలతో రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ఆ సమయంలో కూడా రాజకీయాలు చేయడానికి కొందరు ప్రయత్నించారని విమర్శించారు.

భక్తులు పూర్తిగా సహకరించారు..

అయినా సాధారణ భక్తులు పూర్తి స్థాయిలో సహకరించడంతో పసర దారిలో ట్రాఫిక్ జామ్ లేకుండా నిర్వహించగలిగామని సీతక్క చెప్పారు. భక్తులు సజావుగా దర్శనాలు చేసుకుని ఆనందంతో తిరిగివెళ్లారని, కొంతమంది భక్తులకు కలిగిన అసౌకర్యానికి ప్రభుత్వం చింతిస్తుందన్నారు. ఈ జాతర అనుభవాల ఆధారంగా వచ్చే జాతరలో ట్రాఫిక్ జామ్ పూర్తిగా లేకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తల్లుల జనప్రవేశం నుంచి వనప్రవేశం వరకు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించామని, ఆ అప్రమత్తత వల్లే కోట్లాది మంది భక్తులు వచ్చినా మేడారంలో సజావుగా దర్శనాలు సాధ్యమయ్యాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మేడారం జాతరలో ప్రమాదాలు జరుగుతాయని కొందరు స్వామీజీలు తప్పుడు ప్రచారాలు చేశారని, సమ్మక్క సారక్కలపై ప్రజల్లో పెరుగుతున్న భక్తిని కొందరు తట్టుకోలేకపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Embed widget