అన్వేషించండి

KCR Notice : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు నోటీసులు, జనవరి 30 మధ్యాహ్నం 3 గంటలకు విచారణ!

Phone Tapping Notice For KCR: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోబోతోంది. పోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు.

Phone Tapping Notice For KCR:  ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే BRS పార్టీ ముఖ్యనేతలను విచారించిన SIT, ఇప్పుడు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించనుంది. CRPC 160 ప్రకారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తు అధికారి, ఏసీపీ వెంకటగిరి ముందు జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్‌కు విచారణకు రావొచ్చని.. లేదా ఆయన వయసు రీత్యా ఆయనకు తగిన చోట విచారణకు హాజరు కావొచ్చని నోటీసులో పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో నోటీసులు అందజేశారు. కేసీఆర్ ఎక్కడ విచారణ కోరుకుంటున్నారో దర్యాప్తు అధికారికి తెలపాలని నోటీసుల్లో సూచించారు.

వయసురీత్యా పీఎస్ రావాల్సిన అవసరం లేదన్న సిట్ అధికారులు విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు.  హైదరాబాద్ పరిధిలో KCR కోరిన చోటే విచారణ జరుగుతుందని...అయితే ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు సిట్ అధికారులు.  జనవరి 30 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నారు సిట్ అధికారులు.  

ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు BRS అగ్రనాయకులను విచారించారు సిట్ అధికారులు. మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ ఎంపీ సంతోష్ రావును ప్రశ్నించారు. వీరి నుంచి సేకరించిన వివరాలు, ప్రస్తుతం జైల్లో ఉన్న పోలీసు అధికారుల నుంచి సేకరించిన వివరాలు ఆధారంగా KCRను ప్రశ్నించనున్నారు. 


KCR Notice : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు నోటీసులు, జనవరి 30 మధ్యాహ్నం 3 గంటలకు విచారణ!

 

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత BRS ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమ ఫోన్ నిఘా ఆరోపణలతో మొదలైంది.. 2024 మార్చిలో ఈ విషయం వెలుగుచూసింది
 
అప్పటి ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు ముఖ్యంగా మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రతిపక్షనేతలు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు, న్యాయమూర్తులు, సెలబ్రెటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయ్

2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. SIB లోని అదనపు ఎస్పీ ప్రణీత్ రావు ఫిర్యాదు మేరకు DSP ప్రణీత్ రావు వంటి అధికారులపై అక్రమ నిఘా ఆరోపణలతో కేసు ప్రారంభమైంది
 
600 మందికిపైగా ఫోన్లు ట్యాప్ చేశారని వేలమంది కాల్ డేటా రికార్డులు , ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డులు అక్రమంగా యాక్సెస్ చేశారనే ఆరోపణలున్నాయి. ఇది ముఖ్యంగా ప్రతిపక్షాలను నియంత్రించేందుకు , ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు జరిగిందనే ఆరోపణలున్నాయి
 
ఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటైంది. 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి వరకూ సిట్ హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరింత బలపడింది. పలువుపు SIB అధికారులు అరెస్ట్ అయ్యారు

BRS అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు విచారణకు హాజరయ్యారు..లేటెస్ట్ గా కేసీఆర్ కు నోటీసులు జారీచేసింది సిట్ 
 
ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో  కలకలం రేపుతోంది..BRS వర్గాలు దీన్ని రాజకీయ ప్రతీకారంగా చూస్తున్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిఘా జరిగిందని, దాన్ని బయటపెట్టాలని చెబుతోంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాలు, సిట్ విచారణలో వెలుగుచీసిన వాస్తవాల ఆధారంగానే తాము ముందుకు వెళ్తున్నామని సిట్ అధికారులు స్పష్టం చేశారు. జనవరి 30న జరగనున్న విచారణలో కేసీఆర్ ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారు? ఏ సమాధానాలు చెబుతారు? ఇదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది

 

టాప్ హెడ్ లైన్స్

జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget