అన్వేషించండి

Phone Tapping Case: మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు.. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం

Former MP Santosh Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జనవరి 27న విచారణకు హాజరుకావాలని నోటీసులలో సిట్ పేర్కొంది.

Phone Tapping Case: హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. మంగళవారం (జనవరి 27న) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. గత BRS ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపణలున్నాయి. గత రెండేళ్లుగా కేసు విచారణ కొనసాగుతోంది. తాజాగా మాజీ ఎంపీ సంతోష్ రావును ప్రశ్నించేందుకు సిట్ సిద్ధంగా ఉంది.

ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లకు సిట్ నోటీసులు ఇవ్వడం, వారు అధికారుల ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హరీష్ రావును సుమారు 7 గంటలకు పైగా విచారించిన అధికారులు, ఆ తర్వాత కేటీఆర్ విచారణకు హాజరుకాగా స్టేట్‌మెంట్ తీసుకున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ అధికారుల వాంగ్మూలం, సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కేసులో జోగినల్లి సంతోష్ రావు పాత్రపై సిట్ దృష్టి సారించింది. ఈ క్రమంలో మాజీ ఎంపీకి 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది.

ముదురుతున్న రాజకీయ సెగ.. సిట్ విచారణలో బీఆర్ఎస్ అగ్రనేతలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం క్లైమాక్స్ దశకు చేరుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT) ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించడమే కాకుండా, బీఆర్ఎస్ అగ్రనేతలను విచారిస్తోంది. గులాబీ పార్టీ నేతలకు వరుస నోటీసులు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. 

నేతలపై ప్రధాన ఆరోపణలు
 రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తుల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ నేతలపై ఉంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాన్ని సేకరించి, వ్యాపారవేత్తలను బెదిరించి పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించారనే ఫిర్యాదులు సిట్‌కు అందాయి. సిరిసిల్ల కేంద్రంగా ఒక ప్రత్యేక 'వార్ రూమ్' ఏర్పాటు చేసి నిఘా నిర్వహించారని, దీని కోసం ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు పార్టీ నిధులను మళ్లించారని సెట్ అనుమానాలు వ్యక్తం చేసింది. 

ఆధారాలు ధ్వంసం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వ మార్పు సమయంలో కీలకమైన డేటా, హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారనే ఆరోపణలపై మాజీ ఎస్‌ఐబీ (SIB) అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పలువురు పోలీసు అధికారులు బెయిల్ రావడంతో విడుదలయ్యారు. 

సిట్ దర్యాప్తు తాజా పరిణామాలు
మాజీ మంత్రి హరీష్ రావును ఇటీవల సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. ఆయనను ఈ కేసులో ఒకవైపు నిందితుడిగా, మరోవైపు బాధితుడిగా (ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఆధారాలు) అధికారులు భావిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం ఈ కేసులో సిట్ అధికారులు కేటీఆర్, హరీష్ రావులను సాక్ష్యులుగా మాత్రమే విచారించారని, అయితే ఎందుకు భయపడుతున్నారని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ విచారణ
హరీష్ రావు తరువాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన కేటీఆర్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. పార్టీ ఆర్థిక లావాదేవీలు, ఎలక్టోరల్ బాండ్లు, ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు అంశాలపై ఆయన నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారని సమాచారం. తాజాగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. జనవరి 27న తాను విచారణకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం అన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget