(Source: ECI/ABP News/ABP Majha)
ఎమ్మెల్యే కొనుగోల విచారణ జాబితాలో మరో రెండు పేర్లు- నందు భార్య, మరో అడ్వకేట్‌కు నోటీసులు
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు... రోజుకో టర్న్ తీసుకుంటుంది. ఈ కేసు దర్యాప్తు కోసం వేసిన సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ లిస్ట్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన సిట్... మరో ముగ్గురిని విచారించేందుకు నోటీసులు జారీ చేసింది కానీ అందులో ఒకరే విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు... రోజుకో టర్న్ తీసుకుంటుంది. ఈ కేసు దర్యాప్తు కోసం వేసిన సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. అరెస్టైన వాళ్లు ఇచ్చిన సమాచారం, వారి ఫోన్లలో ఉన్న సమాచారం, వీడియోలో వారు ప్రస్తావించిన పేర్లను పట్టుకొని సిట్ తీగ లాగుతోంది.
కేసుకు సంబంధించిన తీగ లాగుతున్‌న సిట్... కీలకంగా భావించే ముగ్గురికి గత వారం నోటీసులు ఇచ్చింది. సోమవారం(21 నవంబర్)నాడు విచారణకు రావాలని పిలుపునిచ్చింది. సిట్ నోటీసులు పంపిన ముగ్గురిలో కరీంనగర్‌లో న్యాయవాదిగా పని స్తున్న శ్రీనివాస్ ఒక్కరే విచారణకు హాజరయ్యారు. ఆయన్ని రెండు రోజుల పాటు విచారించింది సిట్ బృందం. మిగతా ముగ్గురు బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి మాత్రం విచారణకు రాలేదు... ఎందుకు రావడం లేదో సమాచారం కూడా ఇవ్వలేదు.
వాళ్ల విచారణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తూనే మరో ఇద్దరికి తాజాగా నోటీసులు జారీ చేసింది సిట్. నందు భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన అడ్వకేట్ ప్రతాప్ గౌడ్‌కి నోటీసులు ఇచ్చిందది. ఇవాళ కచ్చితంగా విచారణకు రావాలని పిలుపునిచ్చింది.