(Source: ECI/ABP News/ABP Majha)
Secunderabad Gas Leakage: వెస్ట్ మారేడ్‌పల్లి కస్తూర్బా కాలేజీలో మళ్లీ ఉద్రిక్తత, ఇంకా ఆసుపత్రుల్లోనే విద్యార్థులు
రెగ్యూలర్ గా గ్యాస్ లీకేజీ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, చికిత్స కోసం హాస్పిటల్ లో చేరుతున్నామని వెస్ట్ మారేడ్‌పల్లి కస్తూర్బా కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Student Protest at Kasturba Gandhi College: సికింద్రాబాద్.. వెస్ట్ మారేడ్‌పల్లి కస్తూర్బా కళాశాలలో మళ్ళీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెగ్యూలర్ గా గ్యాస్ లీకేజీ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, చికిత్స కోసం హాస్పిటల్ లో చేరుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చెత్తకుండి నుండి వెలువడిన దుర్గంధం వల్లనే జరిగిందని అధికారులు, కాలేజ్ నిర్వాహకులు చెప్పడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 25 మంది విద్యార్థులు ఆ రోజు నుండి గీత, యశోదా, నిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పట్ల యాజమాన్యం కనీస బాధ్యత తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలేజీలో జరిగిన తప్పిదాలతో తమతో పాటు తమ కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గదువుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఇంకా ముగ్గురు విద్యార్థులు నిమ్స్ హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని విద్యార్థులు తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొందరు విద్యార్థులలో గుండెలో నీరు చేరిందని డాక్టర్లు చెబుతున్నారని విద్యార్థులు అన్నారు. ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ అస్వస్థతకు గురవ్వడం, మళ్ళీ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం ఇక్కడ పరిపాటిగా మారిందన్నారు. కాలేజీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాదం జరుతుండగానే మరో ముగ్గురు విద్యార్థులు స్పృహ తప్పిపడిపోవడం కలకలం రేపింది. ఆ విద్యార్థులను చికిత్స అందించేందుకు గీత హాస్పిటల్ కు తరలించారు.
వెస్ట్ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ కాలేజీలో నవంబర్ నెలలో విష వాయువులు లీకయ్యాయి. కాలేజీలోని సైన్స్ ల్యాబ్ నుంచి విష వాయువులు లీక్ కావడంతో పది నుంచి 15 మంది వరకు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన కాలేజ్ మేనేజ్‌మెంట్ ఆ విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైన్నారు. తరచుగా ఇలా విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నాయని, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.