అన్వేషించండి

Viral Video: టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !

టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తిపై జరిమానా వేయకుండా రూ. 20,000 లంచం డిమాండ్ చేసిన ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను ఆగ్రహించిన ప్రయాణికులు, కండక్టర్ కలిసి చెప్పులతో కొట్టారు.

నారాయణ్‌ఖేడ్: ఇటీవల ఇందిరమ్మ ఇంటి మంజూరు కోసం ఓ మహిళను అధికారి లంచం అడిగితే ఆమె ఎలా బుద్ధి చెప్పిందో తెలుగు రాష్ట్రాలు మొత్తం చూశాయి. లంచం డబ్బులు తీసుకెళ్లి అందరూ చూస్తుండగా నువ్వు అడిగిన డబ్బులు తెచ్చాను తీసుకో అంటూ వెంటపడి మరీ అతడికి బుద్ధొచ్చేలా చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఆర్టీసీ బస్సులో లంచం అడిగిన ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. లంచం అడిగిన టికెట్ ఇన్‌స్పెక్టర్ ను కండక్టర్, ప్రయాణికులు చెప్పుతో కొట్టారు. 

అసలేం జరిగింది.. 
హైదరాబాద్ నుండి నారాయణ్‌ఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేసేందుకు తెలంగాణలోని రాయికోడ్ వద్ద టికెట్ స్క్వాడ్ అధికారులు నిలిపివేశారు. ఆ బస్సులో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. చెకింగ్ సమయంలో ఒక ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు టికెట్ ఇన్‌స్పెక్టర్లు గుర్తించారు. అయితే, నిబంధనల ప్రకారం అతనికి విధించాల్సింది రూ. 500. కాగా, జరిమానా విధించకపోగా.. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు టికెట్ ఇన్‌స్పెక్టర్ ఆ ప్యాసింజర్, కండక్టర్‌ను ఏకంగా రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. 

టికెట్ ఇన్‌స్పెక్టర్ చేసిన ఈ డిమాండ్‌తో కండక్టర్, ప్రయాణికుడితో పాటు బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సహనం కోల్పోయిన వారు ఆ ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను చెప్పులతో కొట్టారు. ఈ క్రమంలో బస్సు కండక్టర్ కూడా ప్రయాణికులతో కలిసి మరిన్ని చెప్పు దెబ్బలు కొట్టి బుద్ధి చెప్పాడని తెలుస్తోంది. సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సిబ్బందిపై పనిభారం ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో రద్దీ కారణంగానే టికెట్ ఇవ్వడం కండక్టర్‌కు సాధ్యపడలేదని తెలుస్తోంది. 

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక వ్యక్తిని ఇలా గుంపుగా కొట్టడాన్ని చట్టప్రకారం సమర్థించలేకపోయినా, సామాన్య ప్రజల ఆగ్రహాన్ని మాత్రం నూటికి నూరు శాతం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిత్యం కష్టపడి పనిచేసేవారు ఎవరైనా లంచం అడిగితే మండిపడుతున్నారు. వారికి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తమను పీల్చిపిప్పి చేసే లంచగొండి వ్యవస్థ తీరుపై తీవ్ర అసహనంతో దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Breaking News: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
Advertisement

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Embed widget