అన్వేషించండి

Revanth Reddy Returns to Hyderabad: అమెరికా నుంచి తిరిగొచ్చిన రేవంత్ రెడ్డి, నేడు మంత్రులతో కీలక సమావేశం!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. అమెరికా నుంచి విమానంలో బయలుదేరిన రేవంత్ రెడ్డి సోమారం తెల్లవారుజామున  శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సుమారు రెండు వారాల పాటు సాగిన ఈ పర్యటనలో ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొనడంతో పాటు, అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక లీడర్ షిప్ కోర్సును పూర్తి చేశారు. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై మున్సిపల్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలు, కేంద్ర బడ్జెట్ సహా పలు అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.

హార్వర్డ్‌లో లీడర్‌షిప్ కోర్సు.. అరుదైన రికార్డు
ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నిర్వహించిన "లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ: కేయోస్, కాన్‌ఫ్లిక్ట్ అండ్ కరేజ్" అనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడం. జనవరి 25 నుండి 30 వరకు జరిగిన ఈ కోర్సులో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 62 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడ మైనస్ 20 డిగ్రీల చలిలో కూడా సీఎం ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాధారణ విద్యార్థిలా తరగతులకు హాజరయ్యారు. ముఖ్యమత్రి పదవిలో ఉండి హార్వర్డ్ నుంచి ఈ లీడర్‌షిప్ సర్టిఫికేట్ పొందిన తొలి భారతీయ సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధిపై దృష్టి
స్విట్జర్లాండ్ లోని దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 'తెలంగాణ రైజింగ్' నినాదంతో తన టీతో కలిసి భారీ పెట్టుబడులను ఆకర్షించారు సీఎం రేవంత్ రెడ్డి. పలు సంస్థలప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. కొన్ని కంపెనీలతో ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. అనంతరం స్విట్జర్లాండ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. వారం రోజుల హార్వర్డ్ లీడర్ షిప్ కోర్సు పూర్తిచేశారు. కోర్సు ద్వారా నేర్చుకున్న నాయకత్వ మెళకువలను రాష్ట్ర పాలనలో అమలు చేయనున్నారు. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే ఆయన రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం కేంద్ర బడ్జెట్ అనంతర పరిణామాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget