Asaduddin Owaisi: రేవంత్ రెడ్డి ‘RSS అన్న’ - గడ్డం, టోపీలుంటే ఆయనకి అసహ్యం: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Telangana News: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్నాయని ఒవైసీ అన్నారు. రేవంత్ రెడ్డి పేరు ఆర్ఎస్ఎస్ అన్నా అని ఒవైసీ అన్నారు.
Asaduddin Owaisi Comments on Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్నాయని ఒవైసీ అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరు ఆర్ఎస్ఎస్ (RSS) అన్నా అని ఒవైసీ అన్నారు. రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌తోనే (RSS) జీవితాన్ని ప్రారంభించారని ఒవైసీ అన్నారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ని ఎప్పటికీ విడిచిపెట్టలేరని అన్నారు.
మోహన్ భగవత్ కంట్రోలింగ్ లోనే గాంధీ భవన్
అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కంట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన విద్వేషపూరిత మాటలు ఆర్ఎస్ఎస్ రేవంత్ రెడ్డి ఆ సంస్థకే చెందినవాడని తేల్చుతున్నాయి. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తిగానే ఉంటారని’’ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అంతేకాక, ఆయన గడ్డాలు, తలపై టోపీలు ధరించే వారిని అసహ్యించుకుంటారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి తొలుత ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడిగా ఉండి, ఆ తర్వాత ఏబీవీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీలో చేరి పేరున్న నాయకుడిగా ఎదిగారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కొన్నేళ్లకే టీపీసీసీ పదవి ఆయన్ని వరించింది.
#WATCH | On Telangana Congress president Revanth Reddy, AIMIM chief Asaduddin Owaisi, " His name is RSS Anna, he started his life from RSS...he won't leave RSS. Today, Congress's headquarters in Hyderabad is being controlled by Mohan Bhagwat and the hate words that were spoken by… pic.twitter.com/A1jeFGsUCC
— ANI (@ANI) November 14, 2023
ఒవైసీపై రేవంత్ రెడ్డి మాటల దాడి
గత ఆదివారం రేవంత్ రెడ్డి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఒవైసీపై మాటల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఒవైసీ తన షేర్వాణీ కింద ఖాకీ షార్ట్‌లు ధరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారు రజాకార్ల వారసులని వ్యాఖ్యలు చేశారు.