అన్వేషించండి

Hyderabad Traffic: జీహెచ్ఎంసీలో ట్రాఫిక్ నియంత్రణపై సర్కార్ ఫోకస్, సీఎం రేవంత్ కీలక నిర్ణయాలివే

GHMC Traffic Control: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు.

Telangana CM Revanth Reddy: హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ట్రాఫిక్ నియంత్రణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచిస్తూ సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమీషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. నెలకోసారి సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సూచించారు. 

Hyderabad Traffic: జీహెచ్ఎంసీలో ట్రాఫిక్ నియంత్రణపై సర్కార్ ఫోకస్, సీఎం రేవంత్ కీలక నిర్ణయాలివే

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ
హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రేవంత్ ఆదేశించారు. కన్సలెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలని చెప్పారు. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని... మూడు నెలల్లోగా ఈ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులను వెంటనే ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ విధులకు వారి సేవలను వాడుకోవాలని రేవంత్ కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్‌లో) లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తించే పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ నియంత్రణ విధులకు వినియోగించుకోవాలన్నారు.  

Hyderabad Traffic: జీహెచ్ఎంసీలో ట్రాఫిక్ నియంత్రణపై సర్కార్ ఫోకస్, సీఎం రేవంత్ కీలక నిర్ణయాలివే

రహదారులు, జంక్షన్ల విస్తరణపై సర్కార్ ఫోకస్
జీహెచ్ఎంసీలో ఇప్పుడున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలని.. సరిపడే సంఖ్యలో సిబ్బంది ఉండేలా స్టేషన్లను పునర్ వ్యవ్యస్థీకరించాలని రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిటీలో రహదారులు, జంక్షన్ల విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లలో ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలను సైతం పరిశీలించాలని రేవంత్ సూచించారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడుతున్నాం. ట్రాఫిక్ సిబ్బంది అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సిటీలో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అందుకు అవసరమైన ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని అధికారులకు రేవంత్ కీలక సూచనలు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget