Upcoming Telugu Movies: నవ్వుల 'మిత్ర మండలి' To లవ్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' - ఈ దీపావళికి వినోదాల విందు కన్ఫర్మ్
This Week Telugu Movies: టాలీవుడ్ యంగ్ హీరోస్ మూవీస్ ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ దీపావళికి వినోదాల విందు అందించనున్నాయి.

Upcoming Telugu Movies In October 3rd Week Complete List: ఈ దీపావళికి మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు కామెడీ, లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ వచ్చేస్తున్నాయి. ఇటు థియేటర్స్ అటు ఓటీటీల్లో కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఈ వారం మూవీస్, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఓసారి చూస్తే...
టిల్లూ భాయ్ 'తెలుసు కదా'
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా'. డైరెక్టర్ నీరజ కోన ఈ మూవీతోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుండగా... సిద్ధు సరసన శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. వైవా హర్ష కీలక పాత్ర పోషించారు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాగా... ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 17న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
'మిత్ర మండలి'తో నవ్వులే
టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ 'మిత్ర మండలి. ఎస్.విజయేంద్ర దర్శకత్వం వహించగా... ప్రసాద్ బెహర, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, సత్య, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 16న మూవీ థియేటర్లలోకి రానుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా స్టోరీతో పాటు లవ్ యాంగిల్‌ను కూడా మూవీలో చూపించారు.
ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్'
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ లవ్ ఎంటర్టైనర్ 'డ్యూడ్'. ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శరత్ కుమార్, నేహాశెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఈ నెల 17న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ప్రదీప్ 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్'
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'కె ర్యాంప్'. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు. నరేష్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 18న మూవీ రిలీజ్ కానుంది.
ఓటీటీ మూవీస్/వెబ్ సిరీస్‌ల లిస్ట్
- అమెజాన్ ప్రైమ్ వీడియో - పరమ్ సుందరి, ది మలబార్ టేల్స్ (కన్నడ మూవీ), రిప్పాన్ స్వామి (కన్నడ మూవీ), మెయింటెనెన్స్ రిక్వైర్డ్ (ఇంగ్లీష్/తెలుగు మూవీ), ది థికెట్ (ఇంగ్లీష్ మూవీ), టు డై అలోన్ (ఇంగ్లీష్ మూవీ), జమ్నాపార్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్), వెడ్డింగ్ ఇంపాసిబుల్ (సీజన్ 1 వెబ్ సిరీస్)
- ఆహా - ఆనందలహరి (వెబ్ సిరీస్ - అక్టోబర్ 17)
- నెట్ ఫ్లిక్స్ - ది డిప్లొమ్యాట్ సీజన్ 3 (అక్టోబర్ 16), గుడ్ న్యూస్ (అక్టోబర్ 17), ది ఉమెన్ ఇన్ క్యాబిన్, స్విమ్ టు మీ, బూట్స్ వెబ్ సిరీస్ సీజన్ 1, ది చూసెన్, నీరో, ది రిస్సరెక్టడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), విక్టోరియా బెక్ హ్యామ్ (ఇంగ్లీష్ తెలుగా డాక్యుమెంటరీ సిరీస్), ట్రూ హాంటింగ్ (ఇంగ్లీష్/హిందీ డాక్యుమెంటరీ)
- జియో హాట్‌స్టార్ - మర్డర్ బాద్ (హిందీ మూవీ), స్టే (ఇంగ్లీష్ మూవీ, విజార్డ్స్ ఆఫ్ వేవర్లీ ప్లేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 1)
- జీ5 - కిష్కింధపురి (అక్టోబర్ 17), భగవత్ (సిరీస్ - అక్టోబర్ 17)
- యాపిల్ టీవీ ప్లస్ - ది లాస్ట్ ఫ్రాంటియర్ సీజన్ 1, నైఫ్ ఎడ్జ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)





















