Salman Khan: 'సికిందర్' మూవీ ఫెయిల్యూర్... హీరోపై డైరెక్టర్ మురుగదాస్ కామెంట్స్ - కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ సల్మాన్
AR Murugadoss: 'సికిందర్' మూవీ ఫెయిల్యూర్‌కు డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ చేసిన కామెంట్స్‌పై బాలీవుడ్ స్టార్ సల్మాన్ తాజాగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Salman Khan Slams Director AR Murugadoss Allegations Of Sikindar Movie Result: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబోలో వచ్చిన 'సికిందర్' మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిజల్ట్‌పై హీరో సల్మాన్‌ను తప్పుబడుతూ డైెరెక్టర్ మురుగదాస్ రీసెంట్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా, హీరో సల్మాన్ డైరెక్టర్‌కు కౌంటర్ ఇచ్చారు.
బిగ్ బాస్ హౌస్‌లో...
ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్ 19 కొనసాగుతుండగా... సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా వీకెండ్ ఎపిసోడ్‌లో కమెడియన్ రవి గుప్తా అతిథిగా సందడి చేయగా సల్మాన్‌తో సరదాగా మాట్లాడారు. 'హీరోగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన సినిమాలు ఏంటి?' అని రవి గుప్తా సరాదాగా ప్రశ్నించగా... సల్మాన్ సూర్యవంశీ (1992), నిశ్చయ్ (1992) చిత్రాల గురించి ప్రస్తావించారు. రీసెంట్ మూవీస్ గురించి డిస్కషన్ రాగా... 'సికిందర్' రిజల్ట్‌పై డైరెక్టర్ మురుగదాస్ తనపై చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు సల్మాన్.
#Latest: On the #BiggBoss19 set, Megastar #SalmanKhan finally opened up about what went wrong with Sikandar and took a strong stand against director A.R. Murugadoss - the same man who gave interviews blaming Bhai for the film's failure. 🔥 Bhai giving a reality check was much… pic.twitter.com/mPtxQQ0zKm
— Er.Sohail (@BeingSohail__) October 12, 2025
'ఇటీవల నేను ఏ సినిమా చేసినందుకు నేనేమీ డిసప్పాయింట్ కాలేదు. అది 'సికిందర్' కావొచ్చు అని ప్రజలు అంటున్నారు. కానీ నేను దాన్ని నమ్మను. సినిమా కథాంశం బాగుంది. నేను రాత్రి 9 గంటలకు సెట్స్‌పైకి వచ్చే వాడినని అది సమస్యలను సృష్టించిందని డైరెక్టర్ చెప్పిన మాట. కానీ అప్పుడు నా పక్కటెముక విరిగిపోయింది. రీసెంట్‌గా ఆ డైరెక్టర్ తీసిన మరో చిత్రం రిలీజ్ అయ్యింది. ఆ మూవీలో నటుడు 6 గంటలకు చేరుకునేవాడు.' అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read: న్యూ వరల్డ్... న్యూ సెట్ - ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ... బన్నీ కోసం అట్లీ ప్లాన్ వేరే లెవల్
మురుగదాస్ ఏమన్నారంటే?
దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో 'సికిందర్' మూవీ తెరకెక్కిస్తే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మురుగదాస్ సినిమా రిజల్ట్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 'స్టార్ హీరోతో పని చేయడం అంత ఈజీ కాదు. పగటిపూట సీన్స్ తీయాల్సి ఉంటుంది. కానీ ఆ హీరో రాత్రి 8 గంటలకు సెట్స్‌కు వస్తారు. దీంతో మేము రాత్రి పూట మాత్రమే షూట్ చేయాల్సి వచ్చేది. తెల్లవారుజామునే షూట్ చేసేందుకు అలవాటు పడ్డాం. ఓ సీన్‌లో నలుగురు పిల్లలు ఉంటే వారితో తెల్లవారుజామున 2 గంటలకు షూట్ చేయాల్సి వచ్చేది. ఆ టైంకు వారు అలసిపోతారు.
సినిమాలో రాజు తన భార్యను కోల్పోయి అవయవాలను ముగ్గురు వ్యక్తులకు దానం చేస్తారు. హీరో తర్వాత వారిని వెతుకుతారు. అమె కోసం తాను చేయలేని పనులను నెరవేర్చేందుకు యత్నిస్తాడు. ఆ టైంలో గ్రామస్థులందరితోనూ స్నేహం చేస్తాడు. ఆ స్టోరీ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కానీ నేను ఆ ఎమోషన్ సరిగ్గా చూపించలేకపోయాను.' అంటూ కామెంట్స్ చేశారు. వీటిపై తాజాగా సల్మాన్ కౌంటర్ ఇచ్చారు.





















