సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్ అంటే ఎగిరి గంతెయ్యాలి. కానీ, కొంతమంది హీరోయిన్లకు అది ఇష్టం ఉండదు. వాళ్లు ఎవరంటే? చాలామంది నటీమణులు తనతో మళ్లీ మళ్లీ నటించడానికి ఇష్టపడితే.. ఈ ఏడుగురు మాత్రం నో చెప్పారు. ‘సుల్తాన్’లో సల్మాన్‌తో నటించే ఛాన్స్ వచ్చినా క్యారెక్టర్ నచ్చక రిజెక్ట్ చేసిందట దీపికా. 16 ఏళ్ల వయసులోనే సల్మాన్ ఖాన్‌కు నో చెప్పింది శ్రద్ధా కపూర్. సల్మాన్‌కు పెద్ద ఫ్యాన్ అని చెప్తూనే తను నటించిన ‘వాంటెడ్’, ‘కిక్’ చిత్రాలను రిజెక్ట్ చేసింది ఇలియానా. స్టార్లతో నటించనని ఎప్పుడో స్టేట్‌మెంట్ ఇచ్చిన కంగనా.. సల్మాన్ నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్’ను రిజెక్ట్ చేసింది. సల్మాన్‌తో కలిసి నటించిన ‘జానం సమ్జా కరో’ ఫ్లాప్ అయ్యాక మరోసారి తనతో కలిసి నటించనని చెప్పేసింది ఊర్మిళ. పర్సనల్‌గా సల్మాన్ ఖాన్‌ను ఇష్టపడని సోనాలి బింద్రే.. తనతో స్క్రీన్‌పై నటించడానికి కూడా ఇష్టపడలేదు. బ్రేకప్ అయ్యి 20 ఏళ్లుపైనే అయినా మళ్లీ సల్మాన్‌తో కలిసి నటించలేదు ఐశ్వర్య రాయ్.