అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

SI Rajender News: రాయదుర్గం డ్రగ్స్‌ కేసులో SI రాజేందర్ సస్పెండ్, సీపీ ఉత్తర్వులు

ఎస్సై రాజేందర్‌ను కస్టడీలోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు.. అతడిని రెండు రోజుల పాటు విచారణ చేయనున్నారు.

ఇటీవల దొరికిన రాయదుర్గం డ్రగ్స్ కేసులో పోలీసు హస్తం ఉన్నట్లుగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం(సీసీఎస్)లో రాజేందర్ ఎస్సైగా పనిచేస్తున్నారు. నిందితుల వద్ద పట్టుబడిన డ్రగ్స్‌లో సుమారు 1,750 గ్రాముల వరకు దాచిపెట్టి అమ్మేందుకు ఆయన ప్రయత్నించినట్లుగా అధికారులు గుర్తించారు. తాజాగా ఆ ఎస్సై రాజేందర్‌‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్సైను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం (సెప్టెంబరు 6) ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సై రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి కోర్టు రాజేందర్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. 

దీంతో ఎస్సై రాజేందర్‌ను కస్టడీలోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు.. అతడిని రెండు రోజుల పాటు విచారణ చేయనున్నారు. అలాగే రాజేందర్‌కు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

గతంలోనూ అవినీతి ఆరోపణలు
అయితే, రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన కొన్నేళ్ల క్రితం రాయదుర్గం ఎస్ఐగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అప్పట్లో రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఆ ఉత్తర్వులపై కోర్టు నుంచి రాజేందర్ స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత సైబరాబాద్ సీసీఎస్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టుబడిన డ్రగ్స్ ను విక్రయిస్తూ మరోసారి నిందితుడిగా పట్టుబడ్డాడు. సైబరాబాద్ కమిషనరేట్‌లో పని చేస్తున్న రాజేందర్ ఫిబ్రవరి నెలలో సైబర్ నేరంలో భాగంగా ముంబయి వెళ్లారు. 

అక్కడ సైబర్ మోసానికి పాల్పడిన నైజీరియన్‌​ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో నైజీరియన్ వద్ద ఉన్న 1,750 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్సై రాజేందర్ గుట్టుచప్పుడు కాకుండా తన వెంట తెచ్చుకుని ఇంట్లో దాచాడు. ఆ తర్వాత ఆ మాదకద్రవ్యాలను విక్రయించేందుకు రాజేందర్ ప్రయత్నించాడు. రాష్ట్ర నార్కోటిక్ విభాగం పోలీసులకు సమాచారం అందడంతో నార్కోటిక్ విభాగం పోలీసులు రాయదుర్గం పీఎస్ పరిధిలో ఉండే రాజేందర్ ఇంట్లో దాడి చేశారు. ఆయన ఇంట్లో దొరికిన మాదకద్రవ్యాల సరకు విలువ రూ.80 లక్షల విలువ వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్ - లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget