Raj Tarun Case: హైదరాబాద్ టు ముంబై- రాజ్‌తరుణ్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మరో ట్విస్ట్
Raj Tarun Lavanya Case: రాజ్‌తరుణ్, మాల్వీ కలిసి ఉన్న విషయాన్ని లావణ్య ప్రపంచానికి చూపించారు. వాళ్లిద్దరు ఉన్న ప్లాట్‌కు వెళ్లి రెడ్‌హ్యాడెండ్‌గా పట్టించారు.
Raj Tarun Case: హీరో రాజ్‌తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఇన్ని రోజులు హైదరాబాద్‌కే పరిమితమైన ఈ ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ ఇప్పుడు ముంబై చేరింది. అక్కడ జరిగిన వివాదంపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇప్పుడు అక్కడ పోలీసులు ఈ కేసులో మరో కోణంపై దర్యాప్తు చేస్తున్నారు.
రాజ్‌తరుణ్- మాల్వీ రిలేషన్‌పై మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న లావణ్య వారిని వెంటాడి ముంబైలో పట్టుకున్నారు. వారిద్దరు కలిసి ఉండటాన్ని గుర్తించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడ ప్రాపర్టీ కూడా డామేజ్ అయినట్టు ఓ వీడియో ద్వారా తెలుస్తోంది.
రాజ్‌తురణ్, మాల్వీ కలిసి ఉన్న ప్లాట్‌లోకి ప్రవేశించిన లావణ్యతో వారిద్దరు వాగ్వాదానికి దిగారు. అసలు ఇక్కడ నీకేం పని అని రాజ్‌తురణ్‌ను లావణ్య ప్రశ్నిస్తే నీకేం పని అంటూ లావణ్య నిలదీసింది. ఇంతలో అక్కడ గ్లాస్‌లు పగిలినట్టు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మాల్వీ కూడా లావణ్యతో వాదనకు దిగినట్టు తెలుస్తోంది.
ఇలా ముగ్గురు మధ్య డిస్కషన్స్ నడుస్తుండగానే మాల్వీ ఎవరికో ఫోన్ చేస్తూ కనిపించారు. ఇంతలో మాల్వీ రిలేటివ్స్ వచ్చి లావణ్యను నిలదీయడం వినిపిస్తోంది. హిందీలో మాట్లాడుతూ ఇక్కడకు వచ్చి రచ్చ చేయడం ఏంటని ప్రశ్నించడం కూడా వినిపించింది. ఆ వ్యక్తికి లావణ్య కూడా గట్టిగానే ఇచ్చింది. నా మనిషిని మీరు తీసుకురావడం ఎంత వరకు కరెక్టని నిలదీసింది. ఈ వాగ్వాదంలో బూతులు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ
ఇలా తీవ్ర వాగ్వాదం తర్వాత ముగ్గురు కలిసి స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ముగ్గరూ సెలబ్రిటీలు కావడంతో పోలీసులు నచ్చజెప్పి కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారని సమాచారం.
ఇప్పటికే రాజ్‌తరుణ్, మాల్వీపై హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేశారు. ఈ కేసు వివరాలను కూడా లావణ్య ముంబై పోలీసులకు తెలియజేశారు. శుక్రవారమే ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక విషయాలను కోర్టుకు తెలియజేశారు. లావణ్య, రాజ్‌తరుణ్ చాలా కాలంగా సహజీవనం చేశారని తేల్చారు. ఇందులో రాజ్‌తరుణ్ నిందితుడేనంటూ కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు.
Also Read: ప్రభాస్, పవన్ విలన్స్‌తో కొత్త హీరో భారీ యాక్షన్ ఫిల్మ్ - రావణ సంహారంలో శివ తాండవం