అన్వేషించండి

MMTS Services : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు

MMTS Services : చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లను నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. మరి కొన్ని నెలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు.

MMTS Services : ప్రయాణికులకు దక్షిమ మధ్య రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే చర్లపల్లి నుంచి పలు రైళ్లు నడుస్తుండగా.. త్వరలో ఎంఎంటీఎస్ సర్వీస్ లను మరింత పెంచనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. ప్రస్తుతం చర్లపల్లి నుంచి ఒక ఎంఎంటీస్ నడుస్తుండగా.. మరో 4, 5 నెలల్లో ఈ సర్వీసులను మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్ - గుంటూరు మార్గంలో డబ్లింగ్ పూర్తయితే మరికొన్ని రైళ్లు నడిపే వెసులుబాటు ఉంటుందని, మరో పక్క ఎక్స్ ప్రెస్ రైళ్లలోనూ జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచేందుకు పనులు సాగుతున్నాయని తెలిపారు.

ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా..

రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో 10 జతల రైళ్లను తరలించనున్నామని తెలిపారు. ఈ రైళ్లకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులుంటాయన్నారు. హైదరాబాద్ స్టేషన్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులతో తలెత్తే ఒత్తిడిని తగ్గించేందుకు మరిన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడపాలని నిర్ణయించామని చెప్పారు. ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ లు నడుపుతామని స్పష్చం చేశారు. చార్మినార్, గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లను మార్చి నుంచి నడుపుతామని, మే నెలాఖరుకల్లా మరో 8 జతల రైళ్లను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైన్ చెప్పారు.

ఘట్ కేసర్ - యాదాద్రి ఎంఎంటీఎస్ లైన్

ఘట్ కేసర్ - యాదాద్రి ఎంఎంటీఎస్ లైన్ కోసం రూ.650 కోట్లు ఖర్చవుతుందని, దీనికి సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే సిద్ధం చేశామని జైన్ అన్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం రూ.491 కోట్లు బకాయి పడిందని తెలిపారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. ఇది పూర్తయితే కేవలం రూ.20 ఛార్జీతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. ఇక రాష్ట్రంలో చేపట్టిన అమృత్ స్టేషన్ల (Amrit Stations) అభివృద్ది పనులు వచ్చే ఏడాది చివరి వరకు పూర్తవుతాయన్నారు. పింక్ బుక్ ను పార్లమెంటులో ఇంకా ప్రవేశపెట్టకపోవడంతో రైల్వే బడ్జెట్ కేటాయింపుల వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని జైన్ చెప్పారు. ప్రాజెక్టులు, సర్వేలు, డీపీఆర్ లు, సౌకర్యాలు వంటి అంశాలన్నీ పింక్ బుక్ లోనే ఉంటాయన్నారు.

ఇక ఈ సారి రైల్వే బడ్జెట్ (Railway Budget)లో తెలుగు రాష్ట్రాలకు భారీగానే కేటాయింపులున్నాయి. ఏపీకి రూ.9.417 కోట్లు, తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read : Ashwini Vaishnav: ఏపీకి రైల్వే శాఖ భారీ శుభవార్త - తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget