By: ABP Desam | Updated at : 05 May 2022 11:16 AM (IST)
రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారయింది. ఈ మేరకు పార్టీ వర్గాలు రాహుల్ తెలంగాణ షెడ్యూల్ వివరాలను వెల్లడించాయి. రేపు (మే 5) రాహుల్ హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టుకు రాహుల్ గాంధీ చేరుకుంటారు. 5.10 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్‌కు వెళ్తారు. 5.45కు వరంగల్‌లోని గాబ్రియోల్ స్కూలుకు చేరుకుంటారు.
6:05 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మళ్లీ రాత్రి 8 గంటలకు వరంగల్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 10:40 హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్ లో బస చేస్తారు.
7వ తేదీ షెడ్యూల్ ఇదీ
రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణా నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. 12:50 - 1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. 1:45 నుంచి 2:45 వరకు గాంధీ భవన్ లో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు.
1:45 నుంచి 2:50 వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేటర్‌లో ఫోటోలు దిగుతారు. 3 గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 5:50కి శంషాబాద్ ఏయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు.
PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్ రెడీ- ఐఎస్బీ హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Madhuyashki Goud : 'రెడ్ల కిందనే పనిచేయాలి' రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మధుయాష్కీ గౌడ్ ఫైర్, బహిరంగలేఖలో సంచలన వ్యాఖ్యలు
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
Revanth Reddy on Modi: మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
Keema Recipe: దాబా స్టైల్లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం