Rachakonda Police: హైదరాబాద్‌లో మళ్లీ గంజాయి రాకెట్.. 1,240 కిలోలు స్వాధీనం, మూలం ఎక్కడంటే..
నిందితుల నుంచి 1,240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రాల మధ్య గంజాయి సరఫరా చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం మేరకు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1,240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వారి నుంచి 3 కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. విశాఖపట్నం సమీపంలోని సీలేరు సమీపంలో నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు వివరించారు.
Also Read: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇలా!
మరోవైపు, గుజరాత్‌లో భారీ మొత్తాల్లో మత్తు పదార్థాలను ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పట్టుకుంది. గుజరాత్ ద్వారకలోని మోర్బిలో 120 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని తెలిపారు. నవ్‌లకి పోర్టు దగ్గరలోని జిన్ జుడా గ్రామంలో మత్తు పదార్థాల ముఠా ఉందనే సమాచారం పోలీసులకు అందింది. ఈ ముందస్తు సమాచారంతో అందడంతో ఆదివారం రాత్రి ఏటీఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Also Read: నా భార్య బజారుకీడుస్తోంది, చచ్చిపోతున్నా.. పురుగుల మందు తాగేసిన బ్యాంకు ఉద్యోగి.. చివరికి..
ఈ క్రమంలో దాదాపు 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. అయితే, గత సెప్టెంబరులో లో ముంద్రా పోర్టు నుంచి సుమారు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు తర్వాత ఇంత మొత్తాల్లో డ్రగ్స్ పదార్థాలను పట్టుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: Nalgonda: పట్నం వెళ్లిన భార్య.. ఇంతలో కత్తిపీటతో గొంతు కోసుకున్న భర్త, ఏం జరిగిందంటే..
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..
Also Read: AP Municipal Elections: ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల ఎన్నికలు ప్రారంభం..
Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు... ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడతాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి