అన్వేషించండి

Viral News: హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పీవీఆర్‌ గలేరియా మాల్‌లో సిబ్బంది మృతి వివాదానికి దారి తీసింది. తీవ్ర అస్వస్థతకు గురైన హౌస్‌కీపింగ్‌ సూపర్‌వైజర్‌ ను ఫుట్‌పాత్‌పై పడేశారని ప్రచారం జరుగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పంజాగుట్టలోని పీవీఆర్ గలెరియా మాల్ లో కార్మికుడు సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు.
  • ఛాతీ నొప్పితో బాధపడుతున్నా, యాజమాన్యం ఇంటికి వెళ్లడానికి అనుమతించలేదు.
  • స్పృహ కోల్పోయిన కార్మికుడిని మాల్ బయట రోడ్డుపై వదిలేశారు.
  • వ్యాపారానికి ఆటంకం కలుగుతుందనే భయంతో ఈ అమానవీయ చర్య.

Viral News: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే పంజాగుట్ట ప్రాంతంలోని పీవీఆర్ గలెరియా మాల్ సాక్షిగా మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన వెలుగు చూసిందని ప్రచారం జరుగుతోంది. విలాసవంతమైన మాల్‌ల సౌకర్యాలను పర్యవేక్షించే ఒక కార్మికుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే, అతడిని ఆదుకోవాల్సిన వ్యవస్థ అత్యంత అమానుషంగా వ్యవహరించిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విధి నిర్వహణలో ఉండగా కుప్పకూలిన సత్యనారాయణ అనే కార్మికుడిని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా రోడ్డుపై వదిలేశారని అంటున్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం ఇదంతా తప్పుడు ప్రచారంగా కొట్టిపారేసింది.   

మాల్‌లో ఏం జరిగింది?

ప్రతి రోజూ లాగానే సత్యనారాయణ ఉదయం పంజాగుట్టలోని పీవీఆర్‌ గలెరియా మాల్‌కు తన విధులకు హాజరయ్యారు. ఆయన అక్కడ హౌస్‌కీపింగ్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్నారు. విధుల్లో ఉండగానే అకస్మాత్తుగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. అసౌకర్యంగా ఉందని తన పై అధికారులకు వివరించారు. తనకు ఒంట్లో బాగాలేదని, ఇంటికి వెళ్తానంటూ అనుమతి కోరారు. అయితే అక్కడి నిర్వాహకులు ఆయన వెళ్లేందుకు అంగీకరించలేదని అంటున్నారు. పని వదిలి వెళ్లడానికి వీలు లేదని తేల్చేశారట. 

కొంతసేపటికి సత్యనారాయణ పరిస్థితి విషమంగా మారింది. సినిమా ప్రొజెక్షన్ స్క్రీన్ ముందే ఆయన వాంతులు చేసుకొని స్పృహతప్పి పడిపోయారని కొందరు చెబుతున్నారు. ఈ సమయంలో ఇతర సిబ్బంది, యాజమాన్యం అప్రమత్తమై వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాల్సింది. కానీ పీవీఆర్‌ పర్యవేకణ వ్యవస్థ ఊహించని రీతిలో ప్రవర్తించిందని చెప్పుకుంటున్నారు. స్పృహ లేకుండా పడి ఉన్న సత్యనారాయణను మాల్‌ లోపల నుంచి ఎత్తుకెళ్లి, బయట ఉన్న ఫుట్‌పాత్‌పై పడేశారని ఆరోపణలు వస్తున్నాయి.  

అక్కడి పై స్థాయి సిబ్బందితో భార్య వాగ్వాదం 

సత్యనారాయణ మరణానికి చేరువలో ఉన్నా మాల్ నిర్వాహకులకు జాలి కలగేదని ప్రచారం చేస్తున్నారు. కేవలం ఐదు నిమిషాల దూరంలోనే ఉన్న నిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించలేదని అంటున్నారు. దీనికి సపోర్ట్‌గా సత్యనారాయణ భార్య అక్కడి సిబ్బందితో చేస్తున్న వాగ్వాదం వైరల్ అవుతోంది. కనీసం అంబులెన్స్‌ను పిలిచినా, దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించినా సత్యనారాయణ ప్రాంతాలు దక్కేవని తోటి సిబ్బంది, కుటుంబ సభ్యులు అంటున్నారు. అంబులెన్స్ పిలవడానికి ఏం అడ్డు వచ్చిందని భార్య ప్రశ్నిస్తున్నారు. 

కార్మికుల ఆగ్రహం 

సత్యనారాయణ బహుషా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా నియమితులైన కార్మికుడు కావచ్చు అని అటున్నారు. ఒక వేళ లోపల కార్మికుడు చనిపోతే వ్యాపారానికి ఆటంకం కలుగుతుందని లేదా ఆసుపత్రుల ఖర్చులు భరించాల్సి వస్తుందనే స్వార్థంతో ఈ పని చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలియగానే కార్మిక సంఘాలు అక్కడకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాయి.   

స్పందించిన యాజమాన్యం

సత్యనారాయణ మృతిపై స్పందించిన పీవీఆర్ యాజమాన్యం జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టింది. సత్యనారాయణ బాగాలేదని చెబితే ఇంటికి వెళ్లిపోయేందుకు ఓకే చెప్పామని అంటున్నారు. ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకి కూడా చెప్పినట్టు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో వివరించారు. ఒక సహాయకుడిని ఇచ్చి పంపించామని, క్షేమంగానే ఆయన బయటకు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని తెలిపారు. సంస్థలో పని చేసే ప్రతి ఒక్కర్నీ కూడా తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తామని అన్నారు. ఇప్పుడు సత్యనారాయణ మృతి తమను ఎంతగానో బాధించిందని సంతాపం తెలిపారు. ఈ పరిస్థితుల్లో తమపై బురదజల్లడం సరైన పద్ధతి కాదని చెప్పుకొచ్చారు. 

Frequently Asked Questions

పంజాగుట్టలోని పీవీఆర్ గలెరియా మాల్‌లో కార్మికుడికి ఏమి జరిగింది?

హౌస్‌కీపింగ్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ విధి నిర్వహణలో ఉండగా ఛాతీలో నొప్పి వచ్చి స్పృహతప్పి పడిపోయారు.

సత్యనారాయణ పరిస్థితి విషమించినప్పుడు మాల్ యాజమాన్యం ఎలా స్పందించింది?

యాజమాన్యం స్పృహలేకుండా పడి ఉన్న సత్యనారాయణను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మాల్ బయట ఫుట్‌పాత్‌పై పడేసింది.

సత్యనారాయణను ఆసుపత్రికి ఎందుకు తరలించలేదు?

వ్యాపారానికి ఆటంకం కలుగుతుందనే లేదా వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుందనే స్వార్థంతో మాల్ నిర్వాహకులు ఈ చర్య తీసుకున్నారని ఆరోపణలున్నాయి.

సత్యనారాయణకు ఏమయ్యింది?

సత్యనారాయణ విధి నిర్వహణలో ఉన్నప్పుడు అస్వస్థతకు గురై, మాల్ యాజమాన్యం సరైన సమయంలో స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget