News
News
వీడియోలు ఆటలు
X

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

FOLLOW US: 
Share:

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములకు పట్టాలు, రెండో విడత గొర్రెల పంపిణి, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవిన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నష్ట పోయిన పంటలకు ఎకరానికి రూ. 10వేల ఆర్థిక సాయం :

వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా నష్ట పోయిన పంటలకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని నేటి సమీక్షా సమావేశంలో సిఎం అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో, క్లస్టర్ల వారీగా  స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి జరిగిన పంటనష్టం వివరాలను సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈమేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సీఎస్ శాంతికుమారికి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావును సీఎం ఆదేశించారు. పంటదెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులను జమచేయాలని సీఎం స్పష్టంచేశారు.

రెండో విడత గొర్రెల పంపిణీ :

ఇప్పటికే ప్రకటించిన విధంగా రెండో విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు, పంపిణీ వ్యవహారాలు సాగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు

పేదల ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షల సాయం :

ఖాళీ జాగాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇందుక సంబంధించి, విధి విధానాలను రూపొందించి జారీ చేయాలని కోరారు.

పోడు భూముల పట్టాలు రెడీ.. త్వరలో తేదీ ప్రకటన

రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో, అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా వుందా అనే అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి లక్షా 55 వేల మంది అర్హులకు పోడుపట్టాలు అందించేందుకు.. పాస్ బుక్స్‌ ముద్రించి సిద్దంగా వున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం అన్ని అంశాలతో తాము సిద్దంగా వున్నామని సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.

సీతారాముల కళ్యాణ నిర్వహణకు కోటి రూపాయలు :

శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 30న భధ్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలను మంజూరు చేశారు సీఎం కేసీఆర్. కరోనా కారణంగా  గత రెండు సంవత్సరాలుగా, భధ్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణకోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Published at : 28 Mar 2023 10:48 PM (IST) Tags: Crop loss KCR Lands Review podu

సంబంధిత కథనాలు

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

టాప్ స్టోరీస్

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !