Hyderabad: హైదరాబాద్‌లో తీసుకున్న లోన్ ఈఎంఐ చెల్లించలేదని కత్తితో బెదిరించిన పేటీఎం ఏజెంట్లు
Crime News: తీసుకున్న లోన్ ఈఎంఐ రుణం తీర్చలేదని ఓ వ్యక్తిపై దాడికి వెళ్లారు పేటీఎం బ్యాచ్. ఫ్యామిలితో ఉన్న విషయం కూడా చూడకుండా బెదిరించారు. దీంతో ఆ ఫ్యామిలీతోపాటు చుట్టుపక్కల వారు కూడా భయపడిపోయారు.
Telangana News: ఓ వ్యక్తి పేటీఎం వద్ద లోన్ తీసుకున్నాడు. బిజినెస్ పెట్టాడు. ఆ బిజినెస్ సరిగా నడవడక ఈఎంఐ చెల్లించడం లేదు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు పేరుతో వచ్చిన వాళ్లు సదరు వ్యక్తిని కత్తితో బెదిరించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన సంచలనం రేపుతోంది.
అశోక్ అనే వ్యక్తి వ్యాపారం స్టార్ట్ చేయడానికి పేటీఎం వద్ద అప్పు తీసుకున్నాడు. వ్యాపారం అనుకున్నంతగా సాగడం లేదు. దీంతో పేటీఎంకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వలేకపోయాడు. దీనిపై ఎన్నో రోజుల నుంచి ఆయన ఫోన్ చేసి అడుగుతున్న పేటీఎం ప్రతినిధులు శుక్రవారం హడావుడి చేశారు. ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న అశోక్‌ను పేటీఎం ప్రతినిధులు చుట్టుముట్టారు. కత్తి చూపించి తీసుకున్న రుణం వెంటనే తీర్చాలని గలాటా చేశారు.
పీటీఎం ప్రతినిధులు చేసిన రచ్చకు అక్కడ ఉన్న వారంతా బెదిరిపోయారు. దీనిపై అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు అయింది.
Paytm loan agents allegedly threaten a customer with a knife to repay loan. Victim Ashok took 6 lakhs loan from Paytm to develop his business. Later due to loss he couldn’t pay instalments on time but he assured agents to repay slowly. Today Paytm agents threatened victim with a… pic.twitter.com/f1KP6XLL8c
— Sowmith Yakkati (@YakkatiSowmith) June 21, 2024