MLC Jeevan Reddy: కేంద్రం మెడలు వంచుతా అని - నువ్వే వంచుకొని వచ్చావు: సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Paddy Procurement In Telangana: రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణలో ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించకుండా రోడ్డెక్కుతుంటే దొంగేదొంగ అన్న విధంగ ఉందన్నారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి.
MLC T Jeevan Reddy slams CM KCR over Paddy Procurement issue: తెలంగాణలో ప్రభుత్వం చెబుతున్న ప్రధాన సమస్య.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులు పండించిన ధాన్యం కొనగోలు చేయకపోవడం. అయితే రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణలో ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించకుండా రోడ్డెక్కుతుంటే దొంగేదొంగ అన్న విధంగ ఉందన్నారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి. వరి ధాన్యం సేకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో పండించే పంటను ఎవరు కొంటున్నారో, రైతులు పండించిన పంటను సైతం వారే కొనాలన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. యూపీఏతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించింది. కాళేశ్వరంతో రైతుకు నీళ్లు అందిస్తామని చెబుతూ స్వయంగా ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి అంటున్నారు. రైతాంగం ఆందోళనకు గురవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆన్ ఆయన ఫార్మ్ హౌస్‌లో వరి సాగు చేస్తున్నారు. ఆ ధాన్యం ఎవరు కొంటారో రైతులవి వారే కొనాలన్నారు. 50 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. భవిష్యత్ లో బాయిల్డ్ రైస్ పై ఒత్తిడి చేయం.. రా రైస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని జీవన్ రెడ్డి గుర్తుచేశారు.
బాయిల్డ్ రైస్‌కు, రా రైస్‌కు మధ్య వ్యత్యాసం అదే..
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో వివాదం చేస్తున్నాయి. కానీ రైతుల సమస్యను మాత్రం పరిష్కరించడం లేదన్నారు. బాయిల్డ్ రైస్‌కు, రా రైస్‌కు మధ్య వ్యత్యాసం కేవలం రూ. 1500 కోట్లు అన్నారు. ఉద్యమ పార్టీగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతా అన్నావు ఏమైంది...? నువ్వు మెడలు వంచుకొని వచ్చావు అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నితోటి ఆంధ్ర ముఖ్యమంత్రి పోయి ప్రధానిని కలిసి వచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల 15 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తగ్గిందని స్వయంగా మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ధాన్యం సేకరణ కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలి.. ఎకరాకు 10 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆడబిడ్డను గౌరవించకపోవడం బాధాకరం
ఆడబిడ్డ అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ నేతలు గౌరవించకపోవడం బాధాకరమన్నారు. ఏ పార్టీ వారైనా సరే రాజ్యాంగ పరమైన పదవిని గౌరవించాలని సూచించారు. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారక్కలను దర్శించుకోడానికి పొతే.. ప్రోటోకాల్ ఉండదా అని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఎట్లా తీసేశారు. ఉగాది వేడుకలకు కూడా రాజ్ భవన్ కు వెళ్లకపోవడం కరెక్ట్ కాదన్నారు. గవర్నర్ ను పట్టించుకోవడం లేదంటే.. రాజ్యాంగాన్ని అగౌరవ పరిచినట్లేనని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ నెలాఖరులో రాహుల్ పర్యటన..
తెలంగాణలో ఈ నెలాఖరులో రాహుల్ గాంధీ పర్యటించనున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని.. వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వున్నా.. అవి బేధాభిప్రాయాలు కావన్నారు. పార్టీ పిసిసి ఎవరు అన్నదీ ముఖ్యం కాదని, అందరం కలిసి పని చేస్తామని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే మా లక్ష్యమన్నారు. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ.. భేదాభిప్రాయాలు కాదని.. ఇన్నాళ్లు కాంగ్రెస్ లో ఉన్నవి భిన్నాభిప్రాయాలు మాత్రమేనని పేర్కొన్నారు.
Also Read: Governor Tamilisai: నాకు అవమానం జరిగినా పర్లేదు, వాళ్లు రాజ్ భవన్‌ను గౌరవించాలి: తమిళిసై