Shamshabad News: శంషాబాద్ ప్రజలకు బిగ్ రిలీఫ్- ఎర కోసం వచ్చి ఇరుక్కున్న చిరుత
Telugu News: శంషాబాద్ వాసులు, అధికారులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకునే సమయం. వారం రోజులుగా ముప్పుతిప్పలు పెట్టిన చిరుత బోనులో బంధీ అయింది.
Telangana News:వారం రోజులుగా శంషాబాద్ ప్రజలకు, అధికారులకు ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. అటవీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. ఐదు రోజుల క్రితం ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది.
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో ఐదు రోజుల క్రితం చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకినట్టు గమనించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో చిరుత ఉందని తెలుసుకున్న అధికారులు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఎయిర్‌పోర్ట ప్రహరీ చుట్టూ అధికారులు గోడకు ఫెన్సింగ్ వైర్‌లు ఫిట్ చేసి ఉన్నారు. చిరుత అటూ ఇటూ తిరిగే క్రమంలో ఆ ఫెన్సింగ్‌కు తాకింది. దీంతో ఎయిర్‌పోర్టులో అలారమ్ మోగింది. అప్రమత్తమైన కంట్రోల్‌రూమ్ అసలు విషయాన్ని గుర్తించింది. అక్కడ చిరుత ఉన్నట్టు తేల్చారు. చిరుతతోపాటు రెండు పిల్లలు ఉన్నట్టు నిర్దారించారు.
శంషాబాద్‌లో చిరుత తిరుగుతోందని సమాచారం అందుకున్న అటవీశాఖాధికారులకు అప్రమత్తమై ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. చిరుతను బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిరుత తిరిగే ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
శంషాబాద్‌లో చిరుత తరచూ వచ్చే ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు అధికారులు. ఎరగా మేకను ఉంచారు. అయితే ఆ బోను వరకు వచ్చిన చిరుత తిరిగి వెళ్లిపోయింది. అధికారులతో ఆడుకున్నట్టే బిహేవ్ చేసింది. చివరకు ఎరగా ఉన్న మేకను తినేందుకు వచ్చి బోనులో చిక్కింది. వెంటనే చిరుతను బంధించిన అధికారులు జూ వద్దకు తరలించారు. చిరుత పిల్లలు ఉన్నాయా... వాటి పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.