Court Recruitment: నిజామాబాద్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!
నిజామాబాద్‌లోని ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు(పోక్సో)లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.
![Court Recruitment: నిజామాబాద్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే! Nizamabad, Principal District and Sessions Judge invites applications for the recruitment of various posts, apply here Court Recruitment: నిజామాబాద్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/20/9c920de68cbc8849b2bdbe4cf4828c8d1666254203199522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిజామాబాద్‌లోని ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు(పోక్సో)లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి విద్యర్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు నిజామాబాద్ జిల్లాకు చెందినవారై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 12.
1. సీనియర్ సూపరింటెండెంట్(హెడ్ క్లర్క్): 01 పోస్టు
2. సీనియర్ అసిస్టెంట్: 01 పోస్టు
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 01 పోస్టు
4. జూనియర్ అసిస్టెంట్: 02 పోస్టులు
5. టైపిస్ట్: 02 పోస్టులు
6. డ్రైవర్: 01 పోస్టు
7. ఆఫీస్ సబార్డినేట్(అటెండర్): 04 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్/ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. నిజామాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులను సీల్డ్ కవర్‌లో సంబంధిత చిరునామాకు పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలి.
ఎంపిక విధానం: టైపింగ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, క్వాలిఫైయింగ్ పరీక్షలో మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 14.10.2022.
దరఖాస్తుకు చివరి తేదీ: 31.10.2022.
చిరునామా: Prl. District and Sessions Court, Nizamabad.
Also Read:
ఏపీ హైకోర్టులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇంగ్లిష్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-1' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పరిధిలో మొత్తం 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల దరఖాస్తుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 2 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే నవంబరు 1లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో నాన్-గెజిటెడ్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 1 లోపు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)